CM Revanth Reddy: బీసీ నేతలు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బలహీన వర్గాల లెక్క తేలాలని కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు.. బీసీలు తెలిపే అభినందనలు నాకు కాదు రాహుల్ గాంధీకి అందివ్వాలన్నారు.
Minister Kandula Durgesh: ఏపీ సచివాలయంలోని తన పేషీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్లి రాష్ట్రానికి లక్ష 78 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తే.. సంతోషించవలసిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఫెడరల్ సెటప్.. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏమి కోరితే అది మంజూరు చేసేందుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అభివృద్ది పరుగులు పెడుతోందని అన్నారు.
పసుపు బోర్డుపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల స్పందించారు. ఎంపీ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. నువ్వెక్కడ పోయావని అడిగినా ప్రశ్నకు... తాను కేంద్రానికి రాసిన లేఖలు విడుదల చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం భారత రత్నతో గౌరవించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టింది మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఏక మొత్తంలో రైతుల రుణాలు మాఫీ చేసింది ఆయనేనని తెలిపారు.
Unregulated lending: లోన్ యాప్‌ల వేధింపులతో ఎంతో మంది ప్రజలు సూసైడ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకు రాబోతుంది. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో లోన్ ఇచ్చే వారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా విధించేలా ముసాయిదాను మోడీ సర్కారు రూపొందిస్తుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్‌పోర్టులను కేంద్రం సస్పెండ్ చేసింది. ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావు పాస్‌పోర్టును కేంద్రం సస్పెండ్ చేసింది. పాస్‌పోర్ట్ సస్పెండ్‌ను ప్రభాకర్ రావు సవాల్ చేశారు.
Constitution Day: భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వెబ్‌సైట్ ( https: //constitution75.com)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
స్క్రాప్‌ల విక్రయం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత కొన్నేళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 3 ఏళ్లలో స్క్రాప్‌లను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 2,364 కోట్లను ఆర్జించినట్లు పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (DPIIT) తెలియజేసింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వెలువడిన వ్యర్థాలు విక్రయించారు.