Jal Sanchai Jan Bhagidari: 6వ జాతీయ జల అవార్డులలో తెలంగాణకు అవార్డుల పంట.. దేశంలోనే తెలంగాణ టాప్
- 6వ జాతీయ జల అవార్డులలో తెలంగాణకు అవార్డుల పంట
- జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ టాప్
- తెలంగాణ అధికారులకు పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలకు వరుసగా 3 ర్యాంకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్‌లో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు-2024లో.. తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సాధించింది. కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద.. తెలంగాణ మొత్తం 5,20,362 పనులు పూర్తిచేసింది.
Also Read
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ (నవంబర్-18న) పురస్కారాలు ప్రదానం చేశారు. జల్ సంచయ్ జన్ భాగీదారీని ఉత్తమంగా అమలు చేసిన రాష్ట్రాలు, జిల్లాలు, స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం 100 అవార్డులను ప్రకటించింది. ఇందులో మూడు రాష్ట్రాలు, 67 జిల్లాలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లు, ఒక పట్టణ స్థానిక సంస్థ, రెండు భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రెండు పరిశ్రమలు, మూడు ఎన్‌జీఓలు, ఇద్దరు దాతలు, 14 మంది నోడల్ అధికారులు ఉన్నారు.
క్షేత్రస్థాయిలో జల సంరక్షణలో ప్రజలు, సంఘాలు, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేసే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద.. రాష్ట్రాలను ఐదు జోన్లుగా విభజించారు. ప్రతి ఒక్కరూ కనీసం 10 వేల కృత్రిమ రీఛార్జి, స్టోరేజ్ నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో రూఫ్‌టాప్ వాన నీటి సంరక్షణ, చెరువులు, కుంటలు, బావుల పునరుద్ధరణ కార్యక్రమాలను చేర్చారు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మున్సిపల్ కార్పొరేషన్లను మూడు కేటగిరీలుగా విభజించి అవార్డులు ప్రకటించారు.
మొదటి కేటగిరీలో ఎంపికైన వాటికి రూ.2 కోట్లు, రెండో దాని కింద కోటి రూపాయలు, మూడో కేటగిరీ కింద రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. జిల్లాల విభాగంలో కేటగిరీ-1 కింద దక్షిణ జోన్ నుంచి మూడు జిల్లాలను ఎంపిక చేయగా.. ఆ మూడింటినీ తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకుంది. ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.6 కోట్ల నగదు బహుమతి అందింది. ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలు ఈ నగదు బహుమతిని సాధించాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఏరియాలో జల సంరక్షణ చర్యలు చేపట్టినందుకు.. హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. రూ.2 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకొంది. ఈ విభాగంలో కేటగిరీ-2లో వరంగల్, నిర్మల్, జనగామ, జిల్లాలు దక్షిణ జోన్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచి రూ.కోటి చొప్పున బహుమతి గెలుచుకున్నాయి.
కేటగిరీ-3లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ 1, 3 ర్యాంకుల్లో నిలిచి.. రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతి సొంతం చేసుకున్నాయి. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలకు నోడల్ అధికారిగా వ్యవహరించిన కేంద్ర జల సంఘానికి చెందిన ఎ.సతీష్‌కు కూడా అవార్డు దక్కింది.
Also Read:Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్‌లో ఉమర్‌కు సహకరించిన కీలక వ్యక్తి ఇతడే.. వెలుగులోకి ఫొటో
అవార్డులు అందుకున్న వారి వివరాలు:
డా.శ్రీజన, ఐఏఎస్, పీఆర్, ఆర్డీ కమీషనర్
కే.అశోక్ కుమార్ రెడ్డి, ఎండీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డ్
రాజర్షి షా, ఐఏఎస్, కలెక్టర్, ఆదిలాబాద్
జే.శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్, నల్గొండ
కుమార్ దీపక్, ఐఏఎస్, కలెక్టర్, మంచిర్యాల
డాక్టర్ సత్యశారద, ఐఏఎస్, కలెక్టర్, వరంగల్
అభిలాష అభినవ్, ఐఏఎస్, కలెక్టర్, నిర్మల్
రిజ్వాన్ భాషా షేక్, ఐఏఎస్, కలెక్టర్, జనగామ
జితేష్ వీ పాటిల్, ఐఏఎస్, భద్రాద్రి కొత్తగూడెం
బి.విజయేందిర, ఐఏఎస్, కలెక్టర్, మహబూబ్ నగర్.
తాజావార్తలు
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!