Polavaram-Banakacherla Project: పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థికశాఖ అధికారుల సమావేశం అయ్యారు. పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు లక్ష్యాలు, కలిగే ప్రయోజనాలపై కేంద్ర ఆర్థిక శాఖ అధికారులకు సవివరంగా వెల్లడించారు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పియూష్ కుమార్ నీటిపారుదల సలహాదారు వెంకటేశ్వరరావు.. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు లేవనెత్తిన సందేహాలకు ఏపీ అధికారులు సమాధానాలు ఇచ్చారు.
Read Also: The Raajasaab : రాజాసాబ్ టీజర్ ఆగమనం.. రేపే అప్డేట్..?
అయితే, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర సర్కార్ ముందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకెళ్లింది. రూ.81 వేల కోట్లతో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదినలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుతో రైతులు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక, నీటి పారుదల శాఖ అధికారులు కేంద్రానికి వివరించారు. మరోవైపు, గత నెలలో జరిగిన సమావేశాల్లో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రధాని, ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు తెలిపారు. సీఎం ప్రతిపాదనలపై పూర్తి వివరాలు ఇవ్వాలని గతంలో కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్‌కు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు సమగ్ర వివరాలను కేంద్ర ఆర్థిక శాఖకు అందిజేస్తున్నారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణ, ప్రజలకు వచ్చే లాభనష్టాలను వివరించారు.