Bird Flu Virus: బర్డ్ ఫ్లూతో పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి మృతి రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల వైరస్ లను నిర్ధారించేందుకు గుంటూరు మెడికల్ కాలేజీలో బర్డ్ ఫ్లూ రీజనల్ సర్వేలెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. మెడికల్ కాలేజీలో ఉన్న స్టేట్ లెవల్ వీడీఆర్ఎల్ ల్యాబ్ కు అనుబంధంగా కొత్త సర్వేలెన్స్ సెంటర్ పని చేస్తుంది. టెస్టులకు అవసరమైన డయాగ్నస్టిక్ కిట్లను పూణే వైరాలజీ ల్యాబ్ అందించనుంది.
Read Also: Siddu Jonnalagadda : వైష్ణవి చైతన్యలో నాకు నచ్చిన విషయం అదే
ఇక, బర్డ్ ఫ్లూ రీజనల్ సర్వేలెన్స్ సెంటర్ లో స్వైన్ ఫ్లూ, ఇన్ ఫ్లూయెంజా వైరస్ ఏ, బీలను నిర్ధారించే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో అధ్యయనం చేసేందుకు వచ్చిన కేంద్ర వైద్య బృందం కొత్తగా ఏర్పాటు చేసిన ల్యాబ్ ను భారత వైద్య పరిశోధన మండలి అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ల్యాబ్ పని తీరుపై ఐసీఎంఆర్ సంతృప్తి వ్యక్తం చేసింది.