భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాత పార్లమెంట్ హౌస్‌లోని సెంట్రల్ హాల్‌లో పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏపీలో జరగబోయే గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2027లో జరగనున్న గోదావరి నది పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది.
IAS Officers: ఏపీ, తెలంగాణ కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమను ఏపీలోనే కొనసాగించాలన్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల అభ్యంతరాలను మోడీ సర్కార్ తోసిపుచ్చింది.
సైన్యంలో చేరేందుకు సిద్ధమవుతున్న అగ్నివీర్‌కు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ కానుక ఇవ్వనుంది. 4 సంవత్సరాల వ్యవధి తర్వాత.. సైన్యంలో అగ్నివీరులను కొనసాగించే పరిమితిని పెంచవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం.. అగ్నివీర్‌లో 25 శాతం మంది పని చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెల్లడి కాలేదు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ తీపి కబురు అందించింది. సీపీఎస్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) అమలు చేయాలని నిర్ణయించింది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తుంది. కేంద్రం ఈ నిర్ణయంతో వీరంతా యూపీఎస్ పరిధిలోకి రానున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల్లో పాత పెన్షన్ స్కీమ్ (OPS) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్)కి బదులుగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 25 ఏళ్లు పని చేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఆమోదం తెలియజేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగర వనాలు అభివృద్ధి నిమిత్తం తొలి విడతగా రూ.15.4 కోట్లను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిధులను మంజూరు చేసిందని తెలిపారు.
కార్మికులు కష్టానికి కేంద్ర ప్రభుత్వం కరిగింది. పలు రంగాలకు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిన కేంద్ర తాజాగా ఈ-శ్రమ్ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరంలో అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ డేటాబేస్ అయిన e-SHRAM పోర్టల్‌ను ప్రారంభించింది.
Atchutapuram Accident: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లిలోని అచ్యుతాపురంలో గల ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర సర్కార్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
CM Pinarayi Vijayan: వయనాడ్ విషాదానికి అక్రమ మైనింగ్, అనుమతి లేని మానవ నివాసాలే కారణమంటూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చేసిన కామెంట్స్ పై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు.