Kaleshwaram Project: సీబీఐ విచారణ జరపండి.. కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ!
- కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపండి
- కేంద్ర హోం శాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం
- ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తునకు సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్న కారణంగా.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పారదర్శక విచారణ కోసం సీబీఐకి కేసు అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకొంది. ఆదివారం కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించగా.. సభ ఆమోదించింది. ఇక సోమవారం ఇందుకు సంబంధించిన లేఖను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వం పంపింది.
Also Read: DK Aruna: కవిత ఇప్పుడొచ్చి.. కేసీఆర్‌కు ఏ పాపం తెలియదంటే నమ్మేస్తారా?
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలిపింది. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పలుశాఖల ప్రమేయంపై సీబీఐ దర్యాప్తు చేయాలని తెలంగాణ సర్కార్ కోరింది. అంతర్రాష్ట్ర అంశాల పైనా దర్యాప్తు చేయాలని లేఖ రాసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పైనా దర్యాప్తు చేయాలని హోంశాఖకు పంపిన లేఖలో పేర్కొంది. సీబీఐ విచారణకు కేంద్ర హోం శాఖ అంగీకరిస్తే.. కాళేశ్వరం బ్యారేజీల (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల)పై దర్యాప్తు మళ్లీ ప్రారంభం అవుతుంది. సీబీఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!