Ponnam Prabhakar : ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవారికి ఇళ్లు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకు ముందు ప్రభుత్వం రేషన్ కార్డులే ఇవ్వలేదన్నారు. మేము పేదల అందరికీ పథకాలు అందేలా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఇందిరమ్మ పేరు ఉంటే డబ్బులు ఇవ్వం అంటున్నారని, మీ జేబులో నుండి ఇస్తున్నారా..? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. అన్నీ దగ్గర పెట్టుకుని మాట్లాడండని, బడ్జెట్‌లో నిధులు పెట్టకపోతే ఎందుకు అడగడం లేదు బీజేపీ నేతలు అని ఆయన అన్నారు.
Uttam Kumar Reddy: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేసిన మంత్రి..
బడ్జెట్ లో తెలంగాణ పైసా ఇవ్వలేదు మీరు మాట్లాడుతున్నారని, వాజ్ పాయ్ లాంటి నేతలే దుర్గమ్మ లాగా పోల్చిన ఇందిరమ్మ పై అవాకులు మానుకోవాలన్నారు. తెలంగాణ ఇండియాలో లేదా..? అని ఆయన పొన్నం ప్రభాకర్ అన్నారు. అటల్ పెన్షన్.. దిన్ దయాల్… శ్యాంప్రసాద్ ముఖర్జీ పేర్లు పెట్టుకుంటున్నారు బీజేపీ నేతలు అని, విల్లెవరైన దేశం కోసం ప్రాణాలు ఇచ్చారా..? తెలంగాణ కి ఏమి చేయని బీజేపీ మంత్రులు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అని ఆయన మండిపడ్డారు.
Bikes Under One Lakh : కేవలం లక్షలోపు మార్కెట్లో లభించే బెస్ట్ స్కూటర్లు ఇవే.. అదుర్స్ అనిపించే ఫీచర్లు, మైలేజ్