ఆంధ్రప్రదేశ్‌కు ముందు ముందు మంచి కాలం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ సందర్భంగా చంద్రబాబు .. కేంద్రానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. ఇది కేవలం ఎన్నికల హామీ కాదని.. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పుకొచ్చారు.
స్పెషల్ ప్యాకేజీ..
విశాఖ ఉక్కుపై కేంద్రం గుడ్‌న్యూ్స్ చెప్పింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఫ్యాక్టరీకి కేంద్రం కొత్త జీవం పోసింది. పరిశ్రమ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ.11, 440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు స్పష్టం చేశారు.
రామ్మోహన్ నాయుడు హర్షం
కేంద్ర ప్యాకేజీపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమ అభివృద్ధి కోసం రూ.11,440 కోట్లు కేటాయించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. నష్టాలను అధిగమించేందుకు, ప్లాంట్ లాభాల బాట పట్టేందుకు కేంద్ర ప్యాకేజీ దోహద పడుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.
Today marks a historic moment etched in steel. It is an emotional and proud moment for people of Andhra Pradesh, as the Union Government, in response to GoAP's consistent efforts since the formation of NDA Government, has approved financial support of Rs. 11,440 crore to revive… pic.twitter.com/O3WxPUh7SU
— N Chandrababu Naidu (@ncbn) January 17, 2025