ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కొరతకు చెక్ పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ లో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 5200 కోట్లతో 1000 మెగావాట్ల విద్యుత్ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కేంద్రం నిధులు విడుదల చేయనున్నది.
Ponnam Prabhakar : ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవారికి ఇళ్లు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకు ముందు ప్రభుత్వం రేషన్ కార్డులే ఇవ్వలేదన్నారు. మేము పేదల అందరికీ పథకాలు అందేలా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఇందిరమ్మ పేరు ఉంటే డబ్బులు ఇవ్వం అంటున్నారని, మీ జేబులో నుండి ఇస్తున్నారా..? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.…
కేంద్ర ప్రకటించిన పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల పంపిణీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అస్తిత్వానికి, ఆత్మగౌరానికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
2027లో జరిగే పుష్కరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం 271 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఏడాదికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది రాకపోకలు సాగిస్తారన్న అంచనాలతో స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి కింద రూ.250 కోట్ల పనులు చేపట్టేలా టెండర్లు పిలిచింది.
రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అన్నారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.. పసుపు, మిరప ఉత్పత్తులలో దేశం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సిటి ఆర్ఐ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుంది.. టూబాకో నిషేధం కొనసాగుతున్నందున ఇతర పంటలపై పరిశోధనలు చేయాలని సూచించారు..
తొక్కిల లాంట, లడ్డూ కౌంటర్లలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది. టీటీడీ బోర్డును కేంద్రం నివేదిక కోరింది. టీటీడీ చరిత్రలో కేంద్రం ఇలా జోక్యం చేసుకోవడం ఇదే మొదటి సారి. క్షేత్రస్థాయి పరిశీలనకు హోం శాఖ అధికారి సంజీవ్‌కుమార్ జిందాల్‌ను ప్రత్యేకంగా నియమించింది. రేపు, ఎల్లుండి రెండ్రోజులు సంజీవ్ జిందాల్ పర్యటించి వివరాలు సేకరించనున్నారు. టీటీడీ కూడా ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని మోడీ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌కు ముందు ముందు మంచి కాలం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.
విశాఖ ఉక్కుపై కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఫ్యాక్టరీకి కేంద్రం కొత్త జీవం పోసింది. పరిశ్రమ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ.11, 400 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.
ప్రైడ్ ఆఫ్ స్టీల్ అని గర్వంగా చెప్పుకునే విశాఖ ఉక్కు మనుగడ మీద ముసురుకున్న గాఢ మేఘాలు తొలిగిపోయాయి. ఎన్నికల హామీకి అనుగుణంగానే NDA ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మనుగడను కాపాడే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. RINLకు 11500కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం అందించేందుకు కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో గత నాలుగేళ్ళుగా కార్మిక సంఘాలు సాగిస్తున్న పోరాటం.. రాజకీయ ఒత్తిళ్ళకు ఫలితం లభించినట్టైంది.