తొక్కిల లాంట, లడ్డూ కౌంటర్లలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది. టీటీడీ బోర్డును కేంద్రం నివేదిక కోరింది. టీటీడీ చరిత్రలో కేంద్రం ఇలా జోక్యం చేసుకోవడం ఇదే మొదటి సారి. క్షేత్రస్థాయి పరిశీలనకు హోం శాఖ అధికారి సంజీవ్‌కుమార్ జిందాల్‌ను ప్రత్యేకంగా నియమించింది. రేపు, ఎల్లుండి రెండ్రోజులు సంజీవ్ జిందాల్ పర్యటించి వివరాలు సేకరించనున్నారు. టీటీడీ కూడా ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
READ MORE: Uttam Kumar Reddy : రేషన్ కార్డుల జారీ పై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
ఇదిలా ఉండగా.. వైకుంఠ ఏకాదశికి ముందు.. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా భక్తులు తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులను రుయా, స్విమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. గాయపడిన వాళ్లకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం చేయించారు.
READ MORE: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ “హెల్త్ ఇన్సూరెన్స్”.. చికిత్సకు ఎంత డబ్బు ఇచ్చిందంటే..?
కాగా.. తిరుమలలోని లడ్డూ పంపిణీ కౌంటర్‌లో ఈనెల 13న స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 47 వ కౌంటర్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే సిబ్బంది స్పందించి మంటలు.. ఇతర కౌంటర్లకు పాకకుండా ఆర్పివేశారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా లడ్డూ పంపిణీ కౌంటర్‌లో స్వల్ప అగ్ని ప్రమాద ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో కేంద్ర సీరియస్ అయినట్లు తెలుస్తోంది.