Tummala Nageswara Rao : రాష్ట్రంలో యూరియా కొరతలేదని, రైతుల ఆందోళనకు గురికావద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. వ్యవసాయాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఈ వారంలో రాష్ట్రానికి మరో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు. గత యాసంగిలో రైతులు ఫిబ్రవరి 20 నాటికి 6.9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేయగా, ఈ సారి 8.80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని, గత సంవత్సరం ఫిబ్రవరిలో 1.99 లక్షల…
MLC Kavitha : నిజామాబాద్ పసుపు యార్డు ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. నిజామాబాద్ పసుపు యార్డులో.. రైతులు దారుణంగా మోసపోతున్నారని, వారం రోజులుగా ధరలు పడిపోయాయన్నారు. కేంద్రం 15 వేలు మద్దతు ధర ఇస్తామని గొప్పలు చెప్పి రైతులను మోసం చేశారని, పసుపు బోర్డు కు చట్ట బద్దత లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. పార్లమెంట్ లో బిల్లు పెట్టీ .. బిల్లు పాస్ చేస్తే రైతులకు మేలు జరుగుతుందని, పసుపు…
ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో చెలరేగిన వివాదం మధ్య, కేంద్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కీలక సూచనలు చేసింది. ప్లాట్‌ఫామ్స్ ప్రవర్తనా నియమావళిని పాటించాలని కేంద్రం సూచించింది. ‘A’ రేటెడ్ కంటెంట్‌ను నిషేధించాలని తెలిపింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్లపై ఫిర్యాదులు అందాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఐటీ రూల్స్‌లోని (2021) కోడ్ ఆఫ్ ఎథిక్స్ గురించి ప్రస్తావించింది. సామాజిక మాధ్యమాలు,…
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అదనంగా జాతీయ విపత్తు నిర్వహణ నిధి (NDRF) నిధులను ఇవ్వనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా బుధవారం ఈ నిధుల విడుదలకు ఆమోదముద్ర వేశారు. తెలంగాణతో పాటుగా ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల కానున్నాయి. ఇందులో తెలంగాణ వాటా కింద రూ.231.75 కోట్లు అందనున్నాయి. గతేడాది ఆయా రాష్ట్రాలకు విడుదల చేసిన ఎన్బీఆర్ఎఫ్ నిధులకు..
Warangal: వరంగల్ నగర అభివృద్ధికి సహాయం చేయాలని కోరుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలిశారు. కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం వేద బ్యాంక్వెట్ హాల్ వద్ద ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. Read also: Dowry Harassment: నవ వధువుకు కట్నం వేధింపులు.. 5 కోట్లు ఇచ్చినా..! వరంగల్ నగర అభివృద్ధికి…
Delhi : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి పరిస్థితుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని డిమాండ్ చేశారు.
Harish Rao : జనాభా నియంత్రణ చేస్తూ, ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు మరింత వృద్ధి చెందేలా చేయూత ఇవ్వాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తే “చోటి సోచ్” అని అవమానించడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.ఈ వ్యాఖ్యలు గౌరవ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చోటి సోచ్ కి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41శాతం రాష్ట్రలకు ఇవ్వాలి. సెస్సులు, సర్…
YSR Congress Party: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నారా? అనేది పెద్ద ప్రశ్న అంటూ సోషల్ మీడియా వేదికగా YSR కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకున్న సందర్భాలు చాలా తక్కువని, రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని తెలిపింది. 100% ఖర్చును కేంద్రమే భరించాల్సి ఉందని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలో…
గత ఆరేళ్లలో ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు దాఖలు చేసిన కేసుల వివరాలను సుప్రీంకోర్టు బుధవారం (జనవరి 29) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2019లో ఆమోదించిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టాన్ని ఉల్లంఘించి, ట్రిపుల్ తలాక్ చెప్పి ఎంత మంది ముస్లిం పురుషులు తమ భార్యలకు విడాకులు ఇచ్చారో స్పష్టత ఇవ్వాలని కోరింది.
వెనుకబడిన రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కు 872.07 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలంలోని కొప్పర్తిలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ ను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కు బదలాయించనున్నారు.