Union Minister Srinivas Varma: రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అన్నారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.. పసుపు, మిరప ఉత్పత్తులలో దేశం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సిటి ఆర్ఐ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుంది.. టూబాకో నిషేధం కొనసాగుతున్నందున ఇతర పంటలపై పరిశోధనలు చేయాలని సూచించారు.. రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అని స్పష్టం చేశారు.. సిటిఆర్ఐ పరిధిలో మరో 4 పంటలను కలిపి ఉత్పత్తి పెంచాలి.. గోదావరి జిల్లాల్లో రైతులు సిటిఆర్ఐ శాస్త్రవేత్తలు పరిశోధనలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు..
Read Also: Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ..
ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సర్వనాశనం చేసింది గత ప్రభుత్వాలే అని దుయ్యబట్టారు శ్రీనివాస్ వర్మ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్ అయ్యారు.. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు కేటాయింపు కంటి తుడుపు చర్యలు అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.. బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు, కార్మిక నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయరని హితబోధ చేశారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికే అనడం సబబు కాదన్నారు.. షర్మిల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.