కరోనా అంతం కాలేదని ఈ మహమ్మారి పోరాటంలో అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి మెలిసి పని చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. దేశంలోని చివ రి పౌరుడి వరకు టీకా అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇంటింటింకి కరోనా వ్యాక్సిన్ అందజేసేందుకు చేపడుతున్న హర్ ఘర్ దస్తక్ కార్యక్రమం పై కేంద్ర మంత్రి అన్ని రాష్ర్టాలు, కేంద్ర పా లిత మంత్రులతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సం…
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది కుటుంబాల్లో విషాదం నెలకొంది. చాలామంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. మరికొందరు కుటుంబసభ్యులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు కనీస నష్టపరిహారం చెల్లించాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రతి కరోనా మరణానికి రూ.50వేల పరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. Read Also: మరో రికార్డు సొంతం చేసుకున్న ప్రధాని మోదీ ఈ మేరకు…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలపై వివాదం నడుస్తోంది. దీనికి ఆజ్యం పోసింది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వం అనే చెప్పాలి. దేశంలో పెట్రోల్ ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. 2019 మేలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.89 ఉంటే ఇటీవల ఆ ధర రూ.116కి చేరింది. అంటే రెండేళ్లలోనే లీటర్ పెట్రోల్ ధర దాదాపుగా రూ.40 పెరిగింది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా విమర్శలు పెరిగాయి. ఈ ప్రభావం ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో…
కేంద్రానికి నిధులు రాష్ట్రాల నుంచే వెళ్తాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. 2014-19 మధ్య రాష్ట్రం చీకటి పాలనను చూసిందన్నారు. బండ మా మీద వేయటానికి ప్రయత్నించటం మాకే మంచిది అయిందని ఆయన అన్నారు. వాస్తవాలేంటో ప్రజలకు చెప్పే అవకాశం వచ్చిందన్నారు. కేంద్రం పెట్రోల్ పై 3.౩5 లక్షల కోట్లు వసూలు చేసింది. వీటిలో రాష్ట్రాలకు పంచింది కేవలం రూ.19,475 కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు. సర్ ఛార్జీలు, సెస్సుల రూపంలో…
2020 ఏడాదికి సంబంధించి పద్మ అవార్డుల గ్రహీతలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఏడుగురికి పద్మవిభూషణ్ అవార్డులు, 10 మందికి పద్మభూషణ్ అవార్డులు, 102 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిలో 29 మంది మహిళలు ఉన్నారు. మరోవైపు 16 మందికి మరణానంతరం పద్మ అవార్డులు ఇస్తుండగా.. ఒక…
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి కడుపునింపిన రేషన్‌ను ఇక నుంచి ఉచితంగా ఇచ్చేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ బియ్యాన్ని ఇక నుంచి ఉచితంగా ఇవ్వబోమని తెలిపింది. కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో గతేడాది మార్చి నుంచి అందిస్తున్న ఉచిత రేషన్‌ను నవంబర్ 30 తర్వాత పొడిగించబోమని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఈ పథకం ద్వారా అర్హులైన 80 కోట్లకు పైగా మంది ప్రజలు నెలకు 5కేజీల చొప్పున బియ్యం/ గోధుమలు, కుటుంబానికి…
దేశంలో సామాన్యులకు పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్న వేళ.. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో వినియోగదారులకు తాత్కాలికంగా స్వల్ప ఉపశమనం కలిగింది. అయితే భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయని ఇంధన నిపుణుడు నరేంద్ర తనేజా వెల్లడించారు. 2023 నాటికి లీటర్ పెట్రోల్ ధర మరో రూ.100 పెరగవచ్చని ఆయన అంచనా వేశారు. చమురు అనేది విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదని… దాని ధరలను నియంత్రించడం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండదని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో…
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. పెంచింది బారెడు.. తగ్గించింది చిటికెడు అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ‘మోదీజీ గత సంవత్సరంలో లీటర్ పెట్రోల్ రూ.28.28, లీటర్ డీజిల్ రూ.27.61 మేర పెరిగాయి. ఇటీవల ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.10 తగ్గించారు. దయచేసి ‘పెద్ద ఉపశమనం’ కలిగించాం అని చెప్పకండి’ అంటూ ఇండియన్ యూత్…
గత నెలలో ఉల్లిపాయల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు తగ్గుముఖం పట్టినా కిలో రూ.40కి పైగానే పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారీ వర్షాల కారణంగా అక్టోబర్ మొదటి వారం నుంచి ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయని.. దీంతో తాము బఫర్ నిల్వల నుంచి ఉల్లిని సరఫరా చేస్తుండటంతో ధరలు దిగి వస్తున్నాయని కేంద్రం తెలిపింది. బఫర్ స్టాక్ నుంచి ఢిల్లీ, కోల్‌కతా, లక్నో,…
దీపావళి వేళ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.10 తగ్గాయి. ఈ తగ్గింపు ధరలు గురువారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే రాష్ట్రాలు కూడా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో 9 బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్‌పై విధించే పన్నును తగ్గించాయి. ఈ జాబితాలో అసోం, త్రిపుర, మణిపూర్,…