దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దీంతో దేశమంతటా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ కరోనా టీకాను తప్పనిసరిగా తీసుకుంటున్నారు. రేపటితో భారత్‌లో కరోనా టీకాల డోసులు 100 కోట్లకు చేరుకోనున్నాయి. 130 కోట్ల భారతావనిలో ఇప్పటివరకు 70 కోట్ల మంది ప్రజలు కరోనా టీకా తొలి డోస్, 29 కోట్ల మంది ప్రజలు సెకండ్ డోస్‌లను వేయించుకున్నారు. భారత్‌లో జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన…
పండుగ పూట రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం… నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయంతో రైల్వేలోని 11.56 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో.. ఉద్యోగులకు బోనస్‌తో పాటు రైల్వేకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. కేబినెట్…
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను ఆమోదిస్తూ దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. 17 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా.. ఇద్దరిని మినహాయించి 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ సిఫార్సులను ఆమోదిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.. తాజా నిర్ణయంతో ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు బదిలీయ్యారు.. ఏపీ హైకోర్టు జడ్జిలుగా జస్టిస్ రవినాథ్ తిలహరి, ఆషానుద్దీన్ అమానుల్లా నియమితులు కాగా.. తెలంగాణ హైకోర్టు…
నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను మరో సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధం అయ్యిందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే బిడ్లను ఆహ్వానించినా.. ఎక్కువ సంస్థలు మాత్రం పోటీ పడింది లేదు.. ఈ దశలో చివరి వరకు నిలిచింది మాత్రం టాటా గ్రూపే.. దీంతో.. టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా వెళ్లిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.. ఎయిరిండియాని 68 ఏళ్ల తర్వాత ఆ సంస్థ అసలు యజమాని అయినట్టువంటి టాటా గ్రూప్ చేతికి వెళ్లిందనేది…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. భారత్‌లో ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు.. ఫస్ట్‌వేవ్ కంటే.. సెకండ్ వేవ్ సమయంలో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూశాయి.. ప్రాణనష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది.. అయితే, ప్రస్తుతం కరోనా రోజువారి కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది.. కానీ, మళ్లీ ముప్పు పొంచేఉందని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం.. రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది కేంద్రం..…
అన్ని రాష్ట్రాల మాదిరిగానే కరోనా ఎంట్రీ తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి మరింతగా కుప్పకూలింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందే ఏపీ అప్పుల్లో కురుకుపోయింది. టీడీపీ హయాంలో అభివృద్ధి పేరిట చేసిన అప్పులు వేలకోట్లలో ఉన్నాయి. ఈ భారం మొత్తాన్ని కూడా జగన్ సర్కారే మోయాల్సి వస్తోంది. వీటి వడ్డీల భారమే ప్రతినెలా తడిచిమోపడు అవుతోంది. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఏపీ…
ప్రత్యేక హోదా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తీరని కలే అని చెప్పుకోవాలి. అది ఇచ్చేది లేదని.. ఇచ్చే అవకాశమూ లేదని మోడీ ప్రభుత్వం వీలు దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంది. ప్రజలు కూడా ఈ విషయంలో హోప్స్ వదిలేసుకున్నారు. కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం హోదాపై అవకాశాలు కల్పించుకుని మరీ కేంద్రం దృష్టికి తీసుకుపోతున్నారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారు. తాజాగా.. పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నేతృత్వం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి.. మళ్లీ…
దేశంలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు 40వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో వైరస్ తీవ్రత నియంత్రణలోకి రావడం లేదు. గత వారంలో దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 68 శాతం ఒక్క కేరళలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 24గంటల్లో దేశవ్యాప్తంగా 43వేల కేసులు వెలుగు చూడగా.. 338 మరణాలు సంభవించాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కోవిడ్ మరణాలను నివారించడంలో 97శాతం…
కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ట్రైబ్యునళ్ళలో ఖాళీల భర్తీ విషయం లో కేంద్ర ప్రభుత్వ తీరు పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పులంటే గౌరవం లేదు… కోర్టు సహనాన్ని పరీక్షిస్తున్నారా…! అని సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణ ఫైర్ అయ్యారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు సీజేఐ ఎన్వీ రమణ. ట్రిబ్యునళ్ళలో ఖాళీల భర్తీపై కేంద్రం వ్యవహరిస్తున్న విధానంపై మండిపడ్డారు సీజేఐ ఎన్వీ రమణ. ట్రిబ్యునల్స్‌ను మూసి…
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ రాజధానిగా విశాఖను పేర్కొంటూ కేంద్రం ఓ ప్రకటన చేసింది. జులై 26న లోక్‌సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం.. ఏపీ రాజధాని వైజాగ్ అని అర్థం వచ్చేలా ప్రకటన చేసింది. అయితే, దీనిపై మళ్లీ క్లారిటీ ఇచ్చింది కేంద్రం… వైజాగ్ ఏపీ రాజధాని అని చెప్పటం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది.. విశాఖ ఒక నగరం మాత్రమేనని తాజాగా పేర్కొంది..…