కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నిర్ణయంతో 11.56 లక్షల కేంద్ర ఉద్యోగులకు లాభం కలుగనుంది. జనవరి 2022 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది. హెచ్‌ఆర్‌ఏ పెరుగనుంది. ఐఆర్‌టీఆఎస్‌ఏ, ఎన్‌ఎఫ్‌ఐఆర్ ఉద్యోగులు డిమాండ్ నేపథ్యంలో హెచ్‌ఆర్‌ఏ పెంపుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే ఎక్స్, వై, జడ్ అంటూ మూడు భాగాలుగా నగరాలను విభజించి, ఎక్స్ భాగానికి రూ.5400, వై భాగానికి రూ.3,600, జడ్ భాగానికి రూ.1800 లుగా పెంచనున్నట్లు సమాచారం. దీనిబట్టి ఎక్స్ ఉద్యోగులకు 27శాతం, వై వారికి 19, జడ్ వారికి 9 శాతం హెచ్‌ఆర్‌ఏ పెరుగనుంది.