రాష్ర్టంలో వరి ధాన్యం కొనుగోలు పై అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు పోటా పోటీగా ధర్నాలు చేస్తూ ఎవ్వరికి వారే మేమంటే మేము రైతుల పక్షం అని చెప్పుకుంటున్నారు. దీనిపై అధికార టీఆర్ ఎస్, ప్రతిపక్ష బీజేపీలు దాడులకు పాల్పడేంత వరకు వ్యవహారం వెళ్లింది. రైతులు రాష్ర్ట ప్రభుత్వ ప్రకటనలతో ఆత్మహత్యలు చేసు కుంటున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా.. టీఆర్ఎస్ మాత్రం రైతులు బాగుండాలనే మేము కోరుకుంటున్నామని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుంటే ఏం చేస్తామంటూ బీజేపీ…
అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ ప్రజలవైపే ఉంటుందని మంత్రి హరీష్రావు అన్నారు. రాష్ర్ట రైతులందరి పక్షాన ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ కూడా ధర్నాలో పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ ..రాష్ట్రానికి అన్యాయం జరిగితే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే నిరసన వ్యక్తం చేశామన్నారు. పంజాబ్లో ధాన్యం కొను గోలు చేస్తారు.. తెలంగాణలో ఎందుకు కొనరంటూ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటుందన్నారు. రాష్ర్టానికి ఒక విధానం…
రేపు టీఆర్స్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం 4గంటలకు శాసనసభ పక్షం భేటీ కానుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రప్రభుత్వ తీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు, రాష్ర్ట బీజేపీ మరో విధంగా వ్యవహరిస్తుందని.. దీంతో రైతులు అయోమయా నికి గురవుతున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పటికే ధర్నాలకు సైతం పిలుపునిచ్చింది. దీనిపై టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో భవి ష్యత్ కార్యచరణను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ…
తిరుపతిలో కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన దక్షిణాది రాష్ర్టాల సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపో వడం చర్చనీయాంశం అయింది. అతి ముఖ్యమైన ఈ సమావే శానికి కేసీఆర్ హాజరు కాకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ర్టాల సాగునీటి ప్రాజెక్టులు, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలపై ముఖ్యంగా చర్చించనున్నారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి అందరూ సీఎంలు హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి కేసీఆర్ స్థానంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్…
పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సిన్లు వేయడంలో ప్రభుత్వం తొందరపడ కూడదని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. కొన్ని దేశా లలో పరిమిత పద్ధతిలో ప్రారంభించబడినప్పటికీ, ప్రపంచంలో ఎక్క డా పెద్ద ఎత్తున COVID-19 పిల్లలకు టీకాలు వేయడం లేదని ఆయ న తెలిపారు. రేపటి తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంద న్నారు. “మేము తొందరపడటం ఇష్టం లేదు…జాగ్రత్తగా నడ వాలి” అని మన్సూఖ్ మాండవీయ తెలిపారు. ఇప్పటికే పిల్లల కోసం పలు కంపెనీలు టీకాలు తయారు…
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నిర్ణయంతో 11.56 లక్షల కేంద్ర ఉద్యోగులకు లాభం కలుగనుంది. జనవరి 2022 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది. హెచ్ఆర్ఏ పెరుగనుంది. ఐఆర్టీఆఎస్ఏ, ఎన్ఎఫ్ఐఆర్ ఉద్యోగులు డిమాండ్ నేపథ్యంలో హెచ్ఆర్ఏ పెంపుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎక్స్, వై, జడ్ అంటూ మూడు భాగాలుగా నగరాలను విభజించి, ఎక్స్ భాగానికి రూ.5400, వై భాగానికి…
కరోనా అంతం కాలేదని ఈ మహమ్మారి పోరాటంలో అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి మెలిసి పని చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. దేశంలోని చివ రి పౌరుడి వరకు టీకా అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇంటింటింకి కరోనా వ్యాక్సిన్ అందజేసేందుకు చేపడుతున్న హర్ ఘర్ దస్తక్ కార్యక్రమం పై కేంద్ర మంత్రి అన్ని రాష్ర్టాలు, కేంద్ర పా లిత మంత్రులతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సం…
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది కుటుంబాల్లో విషాదం నెలకొంది. చాలామంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. మరికొందరు కుటుంబసభ్యులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు కనీస నష్టపరిహారం చెల్లించాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రతి కరోనా మరణానికి రూ.50వేల పరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. Read Also: మరో రికార్డు సొంతం చేసుకున్న ప్రధాని మోదీ ఈ మేరకు…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలపై వివాదం నడుస్తోంది. దీనికి ఆజ్యం పోసింది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వం అనే చెప్పాలి. దేశంలో పెట్రోల్ ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. 2019 మేలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.89 ఉంటే ఇటీవల ఆ ధర రూ.116కి చేరింది. అంటే రెండేళ్లలోనే లీటర్ పెట్రోల్ ధర దాదాపుగా రూ.40 పెరిగింది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా విమర్శలు పెరిగాయి. ఈ ప్రభావం ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో…
కేంద్రానికి నిధులు రాష్ట్రాల నుంచే వెళ్తాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. 2014-19 మధ్య రాష్ట్రం చీకటి పాలనను చూసిందన్నారు. బండ మా మీద వేయటానికి ప్రయత్నించటం మాకే మంచిది అయిందని ఆయన అన్నారు. వాస్తవాలేంటో ప్రజలకు చెప్పే అవకాశం వచ్చిందన్నారు. కేంద్రం పెట్రోల్ పై 3.౩5 లక్షల కోట్లు వసూలు చేసింది. వీటిలో రాష్ట్రాలకు పంచింది కేవలం రూ.19,475 కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు. సర్ ఛార్జీలు, సెస్సుల రూపంలో…