తిరుపతిలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన దక్షిణాది రాష్ర్టాల సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపో వడం చర్చనీయాంశం అయింది. అతి ముఖ్యమైన ఈ సమావే శానికి కేసీఆర్ హాజరు కాకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ర్టాల సాగునీటి ప్రాజెక్టులు, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలపై ముఖ్యంగా చర్చించనున్నారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి అందరూ సీఎంలు హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి కేసీఆర్ స్థానంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ హాజరువుతున్నారు.
ఈ సమావేశానికి కేసీఆర్ హాజరుకాకపోవడానికి గల కారణాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పలేదు. ఇప్పటికే రాష్ర్టంలో వరి ధాన్యం కొనుగోలు అంశం పై అన్ని పార్టీలు విమర్శలు- ప్రతి విమర్శలతో మాటల యుద్ధం నడుస్తోంది. ఈ సమావేశానికి సీఎం హాజరై ఉంటే తెలంగాణ సమస్యలను కేంద్ర హోం మంత్రికి వివరించే అవకాశం ఉండేదని, ఇలాంటి ముఖ్యమైన సమావేశాలకు హాజరుకాకపోవడం వలన తెలంగాణకు నష్టం జరుగుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.