పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సిన్‌లు వేయడంలో ప్రభుత్వం తొందరపడ కూడదని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. కొన్ని దేశా లలో పరిమిత పద్ధతిలో ప్రారంభించబడినప్పటికీ, ప్రపంచంలో ఎక్క డా పెద్ద ఎత్తున COVID-19 పిల్లలకు టీకాలు వేయడం లేదని ఆయ న తెలిపారు. రేపటి తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంద న్నారు. “మేము తొందరపడటం ఇష్టం లేదు…జాగ్రత్తగా నడ వాలి” అని మన్సూఖ్ మాండవీయ తెలిపారు.
ఇప్పటికే పిల్లల కోసం పలు కంపెనీలు టీకాలు తయారు చేసిన అవి ఇంకా మనదేశంలో ఆమోదంలో లేవని జైడస్ వ్యాక్సిన్ కూడా పిల్లల కు పూర్తి స్థాయిలో అందుబాటులో రాలేదని ఆయన తెలిపారు. దీనిపై సమగ్రంగా చర్చించిన తరువాతనే ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. అందరూ కోవిడ్ -19 నింబంధనలు పాటించాలని ఆయన కోరారు. కోవిడ్ ఇప్పుడిప్పుడే అంతం కాదన్నారు. పిల్లలను కోవిడ్ నింబంధనలు పాటించేలా జాగ్రత్తలు వహించాలని ఆయన కోరారు. ఇప్పటికే హార్ ఘర్ దస్తక్ కార్యక్రమం కింద దేశంలోని అంద రికి టీకాలు వేయిస్తున్నామని తెలిపారు. మొదటి డోసు టీకా తీసుకున్న వారు తప్పనిసరిగా రెండో డోసు కూడా తీసుకోవాలని మంత్రి సూచించారు.