దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది సీబీఐ.. ఒకేసారి 40 చోట్ల దాడులు నిర్వహించాయి సీబీఐ అధికారుల బృందాలు… ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.. ముఖ్యంగా విదేశీ నిధులతో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థల్లో సోదాలు జరిగాయి.. 14 మంది ఎన్జీవోల సంబంధించిన వారిని అరెస్టు చేసినట్టుగా తెలుస్తుండగా.. ఆరుగురు ప్రభుత్వం ఉద్యోగులను కూడా సీబీఐ అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. స్వచ్ఛంద సంస్థల ముసుగులో పెద్దఎత్తున డబ్బులను రాబడుతోన్న వ్యవహారాలను కేంద్రం సీరియస్‌గా…
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని రాజా రాజేశ్వరి రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్లు యజమానులుపై కేసు నమోదు చేశారు సీబీఐ అధికారులు.. హైదరాబాద్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు రూ. 62 కోట్లు (రూ.61.71 కోట్లు) రుణం తీసుకుని ఎగవేసినట్టు అభియోగాలు మోపారు.. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది సీబీఐ.. రైస్ మిల్లు యజమానులైన కందా ప్రసన్న కుమార్ రెడ్డి, కందా ప్రతిమ, కందా పద్మనాభ రెడ్డిలపై కేసు నమోదు చేసినట్టు…
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. రూ.139 కోట్ల దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. డోరాండా ట్రెజరీ నుంచి రూ. 139 కోట్లకు పైగా అపహరణకు సంబంధించిన దాణా కుంభకోణం కేసులో.. 73 ఏళ్ల లాలూ ప్రసాదవ్ యాదవ్‌ను ఫిబ్రవరిలో దోషిగా తేల్చింది సీబీఐ కోర్టు.. శిక్ష కూడా విధించింది.. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని…
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.. ఏప్రిల్ 15వ తేదీ తర్వాత వాదనలు వినేందుకు అంగీకారం తెలిపింది సుప్రీంకోర్టు… ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల వ్యవహారంపై తక్షణమే వాదనలు వినాలన్న అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా అభ్యర్థనతో ఈ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు… గత ఐదేళ్లుగా రాజకీయ నేతలపై 2 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత వ్యాజ్యంపై తక్షణమే విచారణ జరపాలని కోరుతూ సీజేఐ ధర్మాసనం…
అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.. తాజాగా అవినీతి కేసులో సీబీఐ అనిల్ దేశ్‌ముఖ్‌ను అరెస్ట్ చేయగా.. ఇక, ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుండి ఆయన్ని కస్టడీలోకి తీసుకుంది సీబీఐ… అవినీతి కేసులో అరెస్ట్ అయిన అనిల్ దేశ్‌ముఖ్‌ను.. తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ చేసుకున్న దరఖాస్తును సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం అనుమతించగా.. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు…
అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా డబ్బులు వెనుకేసిన రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు.. ఒక్కరేంటి.. చిన్ననుంచి పెద్ద వరకు ఎంతో మందిపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.. అయితే, కొందరు మాత్రం అడ్డంగా బుక్కైన సందర్భాలు ఉన్నాయి.. ఇక, ఎప్పుడో చేసిన తప్పులు.. ఏళ్ల తరబడి వెంటాడి నేతలు కూడా ఉన్నారు.. తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ విద్యాశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి మూడేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ ప్రత్యేక…
పశ్చిమ బెంగాల్లో బీర్భూమ్ జిల్లా బోగ్టూయి గ్రామంలో జరిగిన సామూహిక సజీవదహనాల అంశం కీలక మలుపు తిరిగింది. బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినా… ఘటన తీవ్ర దృష్ట్యా రాష్ట్ర పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలేరని అభిప్రాయపడింది కోల్‌కతా హైకోర్టు. నిజానిజాలను వెలికి తీసే బాధ్యతను సీబీఐకి అప్పగించింది. సామూహిక సజీవదహనాలపై సమగ్ర దర్యాప్తు చేసి… ఏప్రిల్ 7వ తేదీలోగా తమకు నివేదిక ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేసింది కోల్‌కతా హైకోర్టు. కేసుకు…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది… ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విమర్శలు ఓ రేంజ్లో జరుగుతున్నాయి… తాజాగా, ఆ విషయంపై స్పందించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. సీఎం వైఎస్ జగన్ సొంత బాబాయి (వైఎస్ వివేకానందరెడ్డి)ని ఎవరు చంపారో క్లారిటీ వచ్చిందన్నారు.. సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి ప్రథమ ముద్దాయిగా.. జగన్ కూడా అందులో భాగస్వామిగా తేలిందని వ్యాఖ్యానించిన ఆయన.. వైఎస్ వివేకా…
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి చర్చగా మారింది.. ఈ కేసులో సీబీఐకి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది.. ఇక, ఆమె అవినాష్‌రెడ్డి పాత్రపై విచారణ జరపాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంతో.. వాంగ్మాలంలో సీఎం వైఎస్ జగన్ పేరు ప్రస్తావించడం పెద్ద చర్చకు దారి తీసింది.. ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. సంచలన వ్యాఖ్యలు…
ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పుడు సంచలనంగా మారుతోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతుండగా.. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి సీబీఐ వాంగ్మూలంలో చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. మరోవైపు.. ఈ వ్యవహాంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి… వివేకా హత్య కేసులో ఎంపీ ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని లేఖలో…