CBI searched Delhi Deputy CM’s bank lockers: ఢిల్లీ మద్యం స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచింది. ఏ1 నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన లాకర్లను మంగళవారం పరిశీలించారు సీబీఐ అధికారులు. దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లోని ఘజియాబాద్ సెక్టార్ 4లో ఉన్న పీఎన్బీ బ్యాంచ్ లో ఐదుగురు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాలపై మనీష్ సిసోడియా స్పందించారు. సీబీఐ అధికారుల దాడుల్లో ఏమీ దొరకలేదని ఆయన అన్నారు. గతంలో నా నివాసంలో సోదాలు చేసినప్పుడు ఏం దొరకలేదని.. ప్రస్తుతం నా బ్యాంకు లాకర్లలో కూడా ఏం దొరకలేదని.. నాకు క్లీన్ చిట్ లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. సీబీఐ అధికారులు మమ్మల్ని బాగా ఆదరించారని.. మేము కూడా విచారణకు సహకరించామని.. నిజం గెలిచిందంటూ.. ఆయన వ్యాఖ్యానించారు.
జన్మాష్టమి రోజున నా ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారని.. ఆగస్టు 19న సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకుందని.. ఈ రోజు లాకర్లు తెరిచినా.. ఏమీ కనిపించలేదని మనీష్ సిసోడియా అన్నారు. నాభార్యకు సంబంధించిన రూ. 80,000 ఆభరణాలు మాత్రమే ఉన్నాయని సిసోడియా వెల్లడించారు.ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకే సీబీఐ అదికారులు దాడులు చేశారని మనీస్ సిసోడియా ఆరోపించారు. అయినా వారు నన్ను జైలుకు పంపేందుకు చూస్తున్నారని.. రెండు మూడు నెలల నన్ను జైలులో వేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆరోపించారు.
Read Also: Team India: టీ20ల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు
ఢిల్లీ మద్యం స్కామ్ లో మనీష్ సిసోడియాతో పాటు మరో 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. అయితే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఏ1గా ఉన్నారు. ఆగస్టు 19న దేశవ్యాప్తంగా 31 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. సిసోడియా నివాసంతో పాటు ఈ స్కామ్ లో పాలుపంచుకున్నట్లు ఆరోపించబడుతున్న పలువరు వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేశారు. అయితే గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పార్టీని, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అడ్డుకునేందుకే సీబీఐతో కేంద్రం దాడులు చేయిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.