Gorantla Madhav Video: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో వివాదంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ సీబీఐకి ఫిర్యాదు చేశారు. చెన్నై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సైబర్ క్రైమ్ కార్యాలయానికి ఫిర్యాదుతో కూడిన ఈ-మెయిల్‌ను పంపారు. ఈ ఫిర్యాదుతో పాటు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లను న్యాయవాది లక్ష్మీనారాయణ జత చేశారు. ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు రెండు ప్రధాన పార్టీల…
కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహాలో మోసాలకు తెరలేపుతూనే ఉన్నారు.. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత.. స్మార్టుగా బ్యాంకుల్లో ఉన్న సొత్తును ఖాళీ చేయడమే కాదు.. ఏ విషయంతో ఎవ్వరిని బుట్టాలో వేయవచ్చు..? ఎలా డబ్బులు దండుకోవచ్చు అనే ప్లాన్ చేస్తున్నారు.. చిన్నచిన్న మోసాలు చేస్తే.. పవలో పరకో వస్తుంది అనుకున్నారేమో.. ఏకంగా కోట్లనే కొల్లగొట్టాలని ప్లాన్ చేశారు.. దండిగా డబ్బులు ఉండి హోదా కోసం ప్రయత్నాలు చేసేవారిని టార్గెట్ చేశారు.. మీకు రాజ్యసభ సీటు కావాలా..? గవర్నర్…
అవినీతి ఆరోపణలపై సీబీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిని అరెస్ట్ చేసింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో పాటు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసింది. గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ లో నిందితులకు సంబంధించిన 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది సీబీఐ. రూ. 93 లక్షలతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులతో కలిసి కుట్ర పన్నుతూ.. ప్రైవేట్ కంపెనీకి టెండర్లు కట్టబెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి.…
భారత్‌లో ఇప్పటికే బ్యాంకులకు కోట్లకు కోట్లు ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న వ్యాపారవేత్తల లిస్ట్ పెద్దదే.. ఇప్పుడు మరో భారీ మోసం వెలుగు చూసింది.. 17 బ్యాంకులను ముంచిన ముగ్గురు వ్యాపారవేత్తలు, ఏకంగా రూ.34,615 కోట్లకు మోసం చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.. ఇక, రంగంలోకి దిగిన సీబీఐ.. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్), మాజీ సీఎండీ కపిల్ వాధావన్, డైరెక్టర్ ధీరజ్ వాధావన్, సుధాకర్ శెట్టిపై కేసు నమోదు చేసింది.. ఏకకాలంలో 12 ప్రాంతాల్లో సోదాలు…
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోత్ సోదరుడు అగ్రసేన్ గెహ్లోత్ ఇంట్లో శుక్రవారం ఉదయం సీబీఐ సోదాలు నిర్వహించింది. జోధ్‌పూర్‌లోని ఆయన ఇంటితో పాటు, ఆయన కార్యాలయాల్లో కూడా ఈ తనిఖీలు చేపట్టినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించారు. తాజాగా వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ తనిఖీలు జరిపినట్లు చెప్పాయి. కాగా అగ్రసేన్ గెహ్లాట్‌పై ఎరువుల ఎగుమతుల్లో అవకతవకల ఆరోపణలున్నాయి. గతంలో ఎరువుల కుంభకోణానికి సంబంధించి ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సీబీఐపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ప్రతీ అంశంపై సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇచ్చే సాయిరెడ్డి.. ఇవాళ చంద్రబాబు సీబీఐ కామెంట్స్ పై సెటైర్లు వేశారు.. అధికారంలో ఉన్నప్పడు రాష్ట్రంలోకి సీబీఐ రావొద్దంటూ ఆంక్షలు పెట్టి, ఇప్పుడు సీబీఐ లేకపోతే దేశాన్ని ఎవరు రక్షిస్తారు అంటాడు..! అని మండిపడ్డ ఆయన.. రెండు నాలుకల నాసిరకం రాజకీయ నాయకుడు (నారా) నాయుడు బాబు..…
విజయవాడ రాజ్‌భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ అధికారుల వల్ల తాము భవిష్యత్ కోల్పోతున్నామని గవర్నర్ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ అధికారులు మారితే ఫలితాలు ఎలా మారతాయని అభ్యర్థులు ప్రశ్నించారు. జవాబు పత్రాలు మార్చడం వెనుక కారణమేంటని.. అధికారులు మారాక ఆచరణ, నిర్వహణ తీరు మారిపోయిందని ఆరోపించారు. గతంలో 326 మందిని ఇంటర్వ్యూకి పిలిచారని.. ఇప్పుడు 202 మందిని ఆ జాబితా నుంచి…
263 మంది చైనా సంతతికి చెందిన వ్యక్తులకు అక్రమ వీసాలు మంజూరు చేయించిన వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇదే విషయంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ చేపడుతోంది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే.. ఈడీ తాజాగా కేసు పెట్టింది. అయితే.. మరోవైపు, ఈ వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరాన్ని నేడు సీబీఐ విచారించనుంది. విచారణలో పాల్గొనాల్సిందిగా గతంలో కార్తీ చిదంబరానికి సమన్లు జారీ…
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి చిదంబరం వీసా కన్సల్టెన్సీ స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది… చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అనుచరుడిని అరెస్ట్ చేసింది సీబీఐ.. కార్తీ అనుచరుడైన భాస్కర్ రామన్‌ను చెన్నైలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా పలు చోట్ల సోదాలు నిర్వహించిన సీబీఐ.. ఆ తర్వాత అరెస్ట్ చేయడం ఆసక్తికంగా మారింది.. మానస పవర్ ప్రాజెక్టు వ్యవహారంలో వీసా విషయంలో భాస్కర్ రామన్‌పై ఆరోపణలు ఉన్నాయి. గత…