Prajwal Revanna Case: ప్రజ్వల్ రేవణ్ణ జాడ కోసం సీబీఐ సాయం కోరిన కర్ణాటక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajwal Revanna Case: కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల కుంభకోణం సంచలనంగా మారింది. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడైన ప్రజ్వల్ అభ్యంతరక వీడియోలు ఇటీవల కర్ణాటక వ్యాప్తంగా, ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హసన్ జిల్లాలో వైరల్‌గా మారాయి. ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై వారి ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం బయటకు రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశం వదిలి వెళ్లిపోయాడు. ఈ కేసును విచారించేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
Read Also: Kolikapudi Srinivasa Rao: తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం
Also Read
- Nirmala Sitharaman: "వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు".. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
- Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
పలువురు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణను కనిపెట్టేందుకు ఇతర దేశాల సాయం కోరాలని కర్ణాటక ప్రభుత్వం సీబీఐ సాయాన్ని కోరింది. బాధితులకు అన్ని విధాలుగా సాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోణలు చేస్తూ ఫిర్యాదు చేసిన మహిళ, 2019 నుంచి 2022 మధ్య కాలంలో తాను పలుమార్లు లైంగిక వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. అతను తన కుమార్తెతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది.
ఈ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రజ్వల్‌పై కర్ణాటక లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ రోజు ప్రజ్వల్ ఇంట్లోని సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. ప్రజ్వల్‌పై రెండోసారి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నిన్న మైసూరులో ఇతడిపై కిడ్నాప్ కేసు నమోదైంది. మరోవైపు ఇది రేవణ్ణ కుటుంబ విషయమని, ఇందులోకి దేవెగౌడను, తనను ఎందుకు లాగుతున్నారని మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. విచారణ జరిపి నిందితుడిని శిక్షించాలని కోరారు.
తాజావార్తలు
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!