YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ, కడప లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డికి ఊరట లభించింది.. వైఎస్ వివేకా హత్య కేసులో.. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది హైకోర్టు.. దీంతో.. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి రిలీఫ్ దొరికినట్టు అయ్యింది.. అయితే, వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది హైకోర్టు.. గతంలో అవినాష్ రెడ్డి.. హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు దస్తగిరి.. కానీ, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కోటివేయలేమన్న హైకోర్టు.. దస్తగిరి పిటిషన్‌ను కొట్టివేసింది.
మరోవైపు.. వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా హైకోర్టు లో ఊరట లభించింది.. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. ఇక, ఇదే కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. కాగా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి.. ఈ కేసులో ఏడవ నిందితుడిగా ఉన్నారు.. భాస్కర్ రెడ్డి హెల్త్ కండీషన్ ఆధారంగా బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.