Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది.
నీట్ అవకతవకలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ వ్యవహారం పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించారు.
UGC-NET Paper Leak: నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీకులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. యూజీసీ-నెట్ పేపర్ లీక్ కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పరీక్షల్ని రద్దు చేసింది. ఈ కేసును ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారిస్తుంది.
UGC-NET case: యూజీసీ-నెట్ పరీక్ష రద్దు చేస్తూ బుధవారం కేంద్ర విద్యామంత్రిశాఖ ఆదేశించింది. పరీక్ష జరిగిన ఒక రోజు తర్వాత పేపర్ లీక్ అయిన విషయం తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Lalu Prasad Yadav: ఆర్జేడీ నేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్పై ‘‘ల్యాండ్ ఫర్ జాబ్’’ స్కామ్లో సీబీఐ శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. లాలూతో సహా చార్జిషీట్లో మరో 77 మందిని ఉన్నారు. కాంపిటెంట్ అథారిటీ నుంచి ఇంకా అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని సీబీఐ కోర్టు తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సీబీఐ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో రెండు వారాల పాటు పొడిగించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. ఆమె బెయిల్పై మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు ముగిశారు. సోమవారం కవిత తరపున వాదనలు ముగిశాయి. వాదనలు అనంతరం జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెయిల్పై తీర్పును రిజర్వ్ చేశారు.
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.