Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా మధ్య సంబంధాలను దెబ్బతీసింది. ఎప్పుడూ లేనంతగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగువస్థాయికి చేరాయి. అయితే ఒక్క నిజ్జరే కాదు చాలా మంది ఖలిస్తానీ వేర్పాటువాదులు, ఉగ్రవాదులు కెనడాలో తలదాచుకుంటూ భారతదేశంపై విద్వేషాన్ని చిమ్ముతున్నారు. సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్, ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఏకంగా భారత దేశాన్ని విడగొట్టాలనే కుట్రకు పాల్పడినట్లు మన నిఘా ఏజెన్సీలు చెబుతున్నాయి.
India-Canada: భారత్ పై కెనడా అనుసరిస్తున్న వైఖరిపై, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై భారత్ పొరగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ స్పందించాయి. ఆధారాలు లేకుండా భారత్ పై ఆరోపణలు చేసిన జస్టిన్ ట్రూడో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా పార్లమెంట్ లో మాట్లాడిన ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో, ఇందులో భారత ప్రమేయం ఉందంటూ…
Hardeep Singh Nijjar: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై ఇండియా-కెనడాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ హత్యకు భారత ఏజెంట్లే కారణమని అమెరికా నిందిస్తుంది. ఇదిలా ఉంటే ఈ హత్యకు సంబంధించి తాజగా ఓ సీసీటీవీ వీడియో బయటపడింది. జూన్ నెలలో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలోని గురుద్వారా వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలో…
భారత్, కెనడాల మధ్య తాజా దౌత్య వివాదం కొనసాగుతున్న ద్వైపాక్షిక సైనిక సంబంధాలపై ప్రభావం చూపబోదని, ఈ విషయాన్ని రాజకీయ స్థాయిలో పరిష్కరించాలని కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్ మంగళవారం అన్నారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమైన తర్వాత భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా భారత్ నుంచి సహకరించాలని కెనడా విజ్ఞప్తి చేస్తోంది. అదే సమయంలో తమ్ముడికి సాయం చేసేందుకు భారత్‌కు వ్యతిరేకంగా అమెరికా ప్రకటనలు చేస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ వివాదం నుంచి ఎవరు ప్రయోజనం పొందుతారో తెలుసుకోండి.
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో బ్రిటీష్ కొలంబియాలో ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు భారత్‌కు సంబంధం ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆరోపించిన వారం రోజుల తర్వాత సోమవారం కెనడాలోని ప్రధాన నగరాల్లోని భారత దౌత్య కార్యాలయాల వద్ద నిరసన తెలియజేయాలని ఖలిస్థానీ గ్రూప్ తన సభ్యులకు పిలుపునిచ్చింది.
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్కూస్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. గత వారం చండీగఢ్, అమృత్‌సర్‌లోని పన్నూన్ ఆస్తులను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.
Punjab Students Parents worry about Study in Canada after India-Canada Issue: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడమే ఇందుకు కారణం. ఈ ఆరోపణల తర్వాత ఇరు దేశాలు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. అంతేకాదు ఇరు దేశాలు దౌత్య వేత్తలను కూడా బహిష్కరించాయి. కెనడా వీసాలను…
ప్రస్తుతం కెనడా- భారత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఖలిస్తాన్ వివాదం రెండు దేశాల మధ్య రగులుతూనే ఉంది. సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య విషయంలో భారత్ హస్తముందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైన విషయం తెలిసిందే. దీంతో భారత్ కెనడా సంబంధాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. Also Read: Delhi: పదో…
Chandra Arya: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా, కెనడా దేశాల మధ్య వివాదాన్ని రాజేసింది. ఈ హత్య నేపథ్యంలో మరో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కెనడాలోని హిందువులను టార్గెట్ చేస్తూ, కెనడా వదిలిపెట్టి భారత్ వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చాడు. ఈ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి హిందువుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై కెనడాలో జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీలో ఎంపీగా ఉన్న చంద్ర ఆర్య తన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఖలిస్తానీ…