ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. భారత్ అల్టిమేటం ఇవ్వడంతో కెనడా చాలా మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది.
World Cup 2023: భారతదేశం ప్రతిష్టాత్మకంగా ఐసీసీ ప్రపంచకప్ మ్యాచుల్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే విదేశీ జట్లు భారత చేరుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచును టార్గెట్ చేస్తూ ఖలిస్తానీ వేర్పాటువాదులు రభస చేయాలని చూస్తున్నారు.
India-Canada: భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదం మరింత ముదురుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. అయితే ఇటీవల ఈ హత్యతో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడంతో వివాదం పెద్దదైంది. దీంతో పాటు కెనడా, భారత సీనియర్ దౌత్యవేత్తను ఆ దేశం నుంచి బహిష్కరించింది. భారత్ ఇందుకు ప్రతిగా కెనడియన్ దౌత్యవేత్తను దేశం వదిలి…
కెనడా భారత్‌తో పరిస్థితిని పెంచడానికి చూడటం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం అన్నారు. కెనడా భారత్‌తో బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు.
భారత్- కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కఠినమైన వైఖరిని తీసుకున్న భారత్.. కెనడా తన 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాలని కోరింది.
UK: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. కెనడా, యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా యూకేలో రాడికల్ సిక్కు ఎలిమెంట్స్ బ్రిటన్ లోని భారత రాయబారిని గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. యూకే స్కాట్లాండ్ ఆల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గో గురుద్వారా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భారత రాయబారి దొరైస్వామిని ఖలిస్తాన్ వేర్పాటువాదులు అడ్డుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడి నేతలతో సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం ఇండియా-కెనడాల మధ్య తీవ్ర దౌత్యవివాదం చెలరేగుతున్న సమయంలో జైశంకర్ యూఎస్ పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) ఉగ్రసంస్థ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసింది.
ICC World Cup 2023: ఇండియా వేదికగా ఐసీసీ ప్రపంచకప్ 2023 క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. అందరి కళ్లు అహ్మదాబాద్ లో జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది. ఈ మ్యాచు ప్రారంభానికి ముందు ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పన్నూపై అహ్మదాబాద్ పోలీసులు పన్నూపై ఎ
India: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య దౌత్యవివాదానికి దారి తీసింది. కెనడా ప్రధాని నేరుగా భారత్ పై విమర్శలు గుప్పించడంతో పాటు భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. ఇక భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను 5 రోజుల్లో దేశం వదిలివెళ్లాలని ఆదేశించింది. కెనడియన్ పౌరులకు వీసాల జారీని భారత్ తాత్కాలికంగా నిలిపేసింది. రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.