నిజ్జర్ హత్య ఆరోపణలతో భారత్- కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అటువంటి పరిస్థితిలో కెనడా కన్జర్వేటివ్ పార్టీ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు పియర్ పోయిలీవ్రే మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న తరువాత, ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశంతో సంబంధాల విలువను అర్థం చేసుకోలేకపోయారు అని ఆయన అన్నారు.
Dabur India: డాబర్ ఉత్పత్తులు క్యాన్సర్లకు కారణమవుతున్నాయని ఆరోపిస్తూ కొంతమంది కస్టమర్లు అమెరికా, కెనడాల్లో కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. హెయిర్ రిలాక్సర్ ఉత్పత్తుల వాడకం అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమైందని ఆరోపిస్తూ కస్టమర్లు యూఎస్, కెనడాలో కేసులు వేసిన కంపెనీలలో తమ అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయని డాబర్ ఇండియా బుధవారం తెలిపింది.
Israel Hamas War: గాజాలోని అల్-అహ్లీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో కనీసం 500 మంది పౌరులు మరణించారు. అనేక ముస్లిం దేశాలు ఈ దాడికి ఇజ్రాయెల్ నే దోషిని చేశాయి.
Super Visa: కెనడాలో ఉంటున్న భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. కెనడాలో ఉంటున్న వారు ఇకపై తమ తల్లిదండ్రులతో ఎక్కువ రోజులు గడిపేలా అక్కడి ప్రభుత్వం సూపర్ వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. ఇమ్మిగ్రేషన్, శరణార్థుల పౌరసత్వ మంత్రిత్వ శాఖ, ప్రజా భద్రత మంత్రిత్వ శాఖల ఆదేశాల మేరకు కొత్త నిబంధనలు ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వచ్చాయి.
Terrorists: విదేశీ గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉగ్రవాదులను పిట్టల్లా రాలిపోతున్నారు. ఎవరు చంపుతున్నారో తెలియదు, ఎందుకు చంపుతున్నారో తెలియదు, కానీ చనిపోయేది మాత్రం ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులే. తాజాగా 2016 పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ జైషే మహ్మద్ ఉగ్రవాది షాహీద్ లతీఫ్ పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో బుధవారం హతమయ్యాడు. గుర్తుతెలియని దుండగులు లతీఫ్ ని కాల్చి చంపారు.
India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య దౌత్యవివాదాన్ని పెంచింది. ఇప్పటికే ఈ రెండు దేశాలు ఉప్పునిప్పుగా ఉన్నాయి. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన చర్యల ద్వారా ఇండియాను మరింతగా రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా-కెనడా విదేశాంగ మంత్రుల మధ్య అమెరికా వేదికగా రహస్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
Israel-Hamas: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై తీవ్రమై ఉగ్రదాడి చేశారు. ఈ దాడిని ఇండియా, యూకే, యూఎస్ఏ, సౌదీ అరేబియా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల అధినేతలు ఖండించారు. ఇప్పటికే ఈ దాడుల వల్ల ఇజ్రాయిల్ లో 300 మందికి పైగా మరణించారు. మరోవైపు ఇజ్రాయిల్ వైమానికి దళం గాజాలోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తోంది. గాజాలో కూడా 250 మందికి పైగా ప్రజలు చనిపోగా.. 1600 మంది వరకు గాయపడినట్లు పాలస్తీనా వైద్య విభాగం వెల్లడించింది.
India-Canada Tensions: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమైన కారణంగా భారత్, కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది.
అక్టోబర్ 13న జీ-20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు(P20 Summit)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో కెనడా కూడా పాల్గొననుంది. నిజానికి భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
Justin Trudeau: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్య విషయంలో భారత్పై అనవసర ఆరోపణలు చేసి దౌత్య సంబంధాలను దెబ్బతిన్నాకున్నాడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. ఇప్పటికే భారత ఆగ్రహం చవిచూసిన ట్రూడో, అక్కడి స్థానికుల నుంచి కూడా మద్దతు కోల్పోతున్నాడు. తాజాగా ఓ కెనడియన్, ప్రధానిని అందరి ముందు తిట్టాడు, కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. దేశంలో హౌసింగ్ సంక్షోభం, కార్బన్ పన్నులపై ప్రశ్నించాడు.