H-1B Visa: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇమ్మిగ్రేషన్, వలసలపై కఠిన వైఖరి అవలంభిస్తున్నాడు. H-1B వీసా హోల్డర్లపై అనేక ఆంక్షలు విధిస్తున్నాడు. ముఖ్యంగా, H-1B వీసా వీసాలపై ఆంక్షలు భారతీయుల అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. ఎందుకంటే ఈ వీసాలపై 70 శాతం భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న క్రమంలో, కెనడా ఆహ్వానం పలుకుతోంది.
కెనడాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన అమన్‌ప్రీత్ అనే మహిళ (27) దారుణ హత్యకు గురైంది. లింకన్‌లోని ఒక పార్కులో అమన్‌ప్రీత్ సైని మృతదేహం లభ్యమైంది. గాయాలతో మృతదేహం లభ్యమైనట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు భారతదేశానికి పారిపోయాడని చెప్పారు.
ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ కపిల్ శర్మ కెనడాకు చెందిన “క్యాప్స్ కేఫ్” గురువారం తెల్లవారుజామున మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కేఫ్ పై తొమ్మిది నుంmr పది బుల్లెట్లు పేలాయి. కాల్పుల్లో అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ నెలలో కపిల్ శర్మ కేఫ్ లో జరిగిన కాల్పుల్లో ఇది రెండవ సంఘటన, మొత్తం మీద మూడవ సంఘటన. కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్…
Bathukamma In Canada: తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) కెనడా ఆధ్వర్యంలో టోరంటోలోని బ్రాంప్టన్ నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో ఎన్ఆర్ఐలు కుటుంబ సమేతంగా హాజరై ఆట, పాటలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్, కెనడా నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేసి, పసందైన తెలంగాణా వంటకాలతో భోజనాలు కూడా ఏర్పాటు చేసారు. కెనడాలోనే పుట్టిపెరిగిన తెలుగు పిల్లలు మన పండగల ప్రత్యేకత…
Khalistani terrorist: కెనడాలో ఉంటూ, ఖలిస్తాన్ అంటూ గొడవ చేసే ఉగ్రవాదులు భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌కు ఖలిస్తానీ ఉగ్రవాది ఇందర్ జీత్ గోసల్ బెదిరింపులు జారీ చేశారు. అరెస్ట్ అయిన కొద్ది రోజులకే కెనడాలో బెయిల్ పొందిన ఇందర్ జీత్ ‘‘ దోవల్, నేను మీ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని వార్నింగ్ ఇచ్చాడు.
Canada: ఖలిస్తానీ ఉగ్రవాదులకు, వారి సంస్థలకు కెనడా ప్రభుత్వం ఎప్పటి నుంచో మద్దతుగా నిలుస్తుందో అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో, ఖలిస్తానీ ఉగ్రవాదుల కోసం భారతదేశంతో ఉన్న దౌత్య సంబంధాలను కూడా రిస్క్‌లో పెట్టాడు. అయితే, తొలిసారిగా, కెనడా నిజాన్ని ఒప్పుకుంది.
Kapil Sharma: ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్‌పై ఖలిస్తానీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కెనడాలో కేఫ్ ప్రారంభించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరిగింది. కనీసం, 9 రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ ఈ కాల్పులకు బాధ్యత వహించారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
కెనడాలో రెండు శిక్షణా విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మృతుల్లో కేరళకు చెందిన విద్యార్థి పైలట్ శ్రీహరి సుకేష్(21) కాగా.. అతని క్లాస్మేట్ కెనడియన్ పౌరుడు సవన్నామే రోయెస్(20)గా గుర్తించారు.
ఢిల్లీకి చెందిన భారతీయ విద్యార్థిని తాన్య త్యాగి కెనడాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం తెలిపింది. జూన్ 17న చనిపోయిందని.. మరణానికి కారణాలేంటో తెలియదని పేర్కొంది.
ప్రధాని మోడీ కెనడాలో పర్యటిస్తున్నారు. జీ 7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు మంగళవారం కెనడా చేరుకున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జీ 7 సమ్మిట్‌కు హాజరయ్యారు. వాస్తవానికి జీ 7లో భారత్ భాగస్వామ్యం కాకపోయినా.. 2019 నుంచి మోడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతున్నారు.