కేటీఆర్, హరీష్ రండి కర్ణాటక వెళ్దాం.. ..ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా..
కర్ణాటకలో కాంగ్రేస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు కేటీఆర్,హరీష్, ఎమ్మెల్సీ కవితలకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తామని అన్నారు. ఇందిరా భవన్ లో వార్ రూమ్, కనెక్ట్ సెంటర్ ను ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇచ్చారని తెలిపారు. ప్రతి మహిళకు నెలకు 2500 వచ్చేలా చేస్తుంది కాంగ్రెస్ అన్నారు. 500 కె గ్యాస్ ఇస్తామన్నారు. రైతుకి క్వింటాలుకి 500 బోనస్ ఇస్తోంది పార్టీ అని తెలిపారు. పేదలకు ఇంటి స్థలం.. ఇల్లు నిర్మాణంకి ఐదు లక్షలు ఇస్తామన్నారు. ఐదు లక్షల గ్యారంటీ విద్యార్థులకు ఇస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి గ్యారంటీ కార్డు ఇస్తామన్నారని తెలిపారు.
చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి రోజా హాట్ కామెంట్లు.. భువనేశ్వరి, బ్రహ్మణిపై గౌరవం పోతుంది..!
చంద్రబాబు, లోకేష్‌తో పాటు భువనేశ్వరి, బ్రహ్మణిపై కూడా సంచలన వ్యాఖ్యలుచేశారు మంత్రి ఆర్కే రోజా.. విజయవాడలోని తుమ్మలపల్లిలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవు అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ ఢిల్లీలో మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి తిరుగుతున్నారు.. కానీ, అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు.. ప్రధాని మోడీ , అమిత్ షా కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు సరైందే.. సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన హైకోర్టు
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు పై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసింది హైకోర్టు డివిజన్ బెంచ్.. ఇదే సమయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది హైకోర్టు.. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు సబబేనని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా అభ్యర్థుల నుండి బయోమెట్రిక్ తీసుకోవాలని పేర్కొంది.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రూల్స్ ను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. అయితే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను 2,33,506 మంది అభ్యర్థులు రాయగా.. పరీక్ష సమయంలో బయో మెట్రిక్ తీసుకొలేదని హై కోర్టును ఆశ్రయించారు ముగ్గురు అభ్యర్థులు.. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. టీఎస్‌పీఎస్సీ పరీక్ష ను సరిగా నిర్వహించలేక పోయిందని వ్యాఖ్యానించింది. కాగా, గ్రూప్-1ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును డివిజన్ బెంచ్‌లో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపై ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ కూడా ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూల్స్ మీరే ఉల్లంఘిస్తే ఎలా అంటూ మండిపడింది. ఒకసారి పేపర్ లీక్, ఇప్పుడేమో బయోమెట్రిక్ సమస్యా? అంటూ ప్రశ్నించింది.
సీఎం కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఏంటి ?.. బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఏంటి? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఏంటి? అని ప్రశ్నించారు. పాలమూరును ఎడారిగా మార్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. మోడీ ఎందుకు పాలమూరు రావద్దని చెప్పడానికి కేటీఆర్ ఎవరు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 575 టీఎంసీలు రావాల్సిన కృష్ణ జలాలను 299 టీఎంసీ లకు మార్చారన్నారు. ఎన్నికలు వస్తే తాయిలాలు ప్రకటన చేస్తారు ముఖ్యమంత్రి అని వ్యంగాస్త్రం వేశారు. పరీక్షలు నిర్వహించడం చేతగాని సర్కార్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ పిల్లల ఆత్మహత్యాలకు కారణం, ఆర్టీసీ కార్మికుల మరణాలకు కారణం ఎవరు…? నిరుద్యోగుల మరణాలకు కారణం ఎవరు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
పర్యాటక రంగంలో అనేక మార్పులు.. సింగిల్ విండోలో అనుమతులు
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి మంచి కృషి జరుగుతోంది.. పెట్టుబడిదారులకు సింగిల్ విండో పద్ధతుల్లో అనుమతులు ఇస్తున్నట్టు తెలిపారు మంత్రి ఆర్కే రోజా.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. పర్యాటకులకు విశేష సేవలు అందించిన హోటల్స్ కు అవార్డులు అందించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి.. ప్రకృతి అందాలు, సాంస్కృతిక వైభవం కలిగిన ప్రాంతం మన దేశం అన్నారు. దేశంలో అత్యధిక పర్యాటక అభివృద్ధి గల ప్రాంతంగా ఏపీ మూడో స్థానంలో ఉందని తెలిపారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షించేలా 2020-2025 పాలసీ అమలు చేస్తున్నాం అని వెల్లడించారు. గండికోట, తిరుపతి, విశాఖపట్నంలో ఒబేరాయ్ హోటల్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. పీపీపీ పద్దతిలో 14 ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నాం.. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తోందని వెల్లడించారు. సింగిల్ విండో పద్ధతుల్లో పెట్టుబడి దారులకు అనుమతి ఇస్తున్నామని.. 48 టూరిజం హోటల్స్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ ఉండే సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పర్యాటక స్థలాలు కబ్జా కాకుండా పీపీపీ పద్దతిలో అభివృద్ధి చేస్తాం.. ఏపీ టూరిజం ఫోరమ్ ను ఏర్పాటు చేసి సంస్థాగతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు మంత్రి ఆర్కే రోజా.
సత్యమేవ జయతే.. భువనేశ్వరి నినాదాలు..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉండగా.. ఆయనకు మద్దతుగా.. ఆయనపై అక్రమ కేసులు పెట్టారంటూ టీడీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఇక, ఈ కార్యక్రమాల్లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా పాల్గొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో మహిళలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్నారు భువనేశ్వరి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చెయ్యలేదు కనకనే ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చారన్నారు. అధికారులకు కూడా బాబుగారు తప్పు చెయ్యలేదని తెలిసి ఎటువంటి ప్రశ్నలు అడగలేకపోయారన్న ఆమె.. ఏమీ తెలియని నాకు ఒక కంపెనీ భాద్యత అప్పగించారు.. చంద్రబాబుకి మహిళలపై నమ్మకం ఉందన్నారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది హత్య వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ.. కారణం ఇదే..
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా, కెనడా దేశాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఏకంగా భారత్ పైనే విమర్శలు చేశారు. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని పార్లమెంట్ లో ఆరోపణలు చేశారు. కెనడా, సీనియర్ భారత దౌత్యవేత్తను ఆ దేశం నుంచి బహిష్కరించింది. కెనడా చర్యలపై భారత్ కూడా సీరియస్ గానే స్పందించింది. సీనియర్ కెనడియన్ డిప్లమాట్ ని భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఇక భారత్ కెనడా పౌరులకు వీసాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఈ సమస్య తారాస్థాయికి చేరింది.
ఇదిలా ఉంటే నిజ్జర్ హత్యలో కొత్త వాదన తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) నిజ్జర్‌ని హతమార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కెనడా, ఇండియా సంబంధాలను దెబ్బతీసేందుకు ఇలా చేసే ప్రణాళికలు రూపొందించినట్లు కొన్ని వర్గాలు వెల్లడించాయి. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్ గా ఉన్న నిజ్జర్ ని, తమ గ్యాంగ్ స్టర్లకు మద్దతు ఇవ్వాల్సిందిగా పాక్ ఐఎస్ఐ కోరిందని, అయితే నిజ్జర్ అందుకు ఒప్పుకోకపోగా.. ఖలిస్తానీ నాయకుల వైపే మొగ్గు చూపాడని తెలుస్తోంది. స్థానికంగా పాపులారిటీ పెంచుకున్న నిజ్జర్ డ్రగ్స్ అక్రమ దందాను నియంత్రిస్తున్నట్లు సమాచారం.
ఒక అమ్మాయిపై పడ్డ ఆర్జీవీ కళ్లు… ఊరు పేరు తెలిస్తే చెప్పండి అంటూ ట్వీట్
రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సెన్సేషన్… సినిమాలతో మాత్రమే కాదు ఆర్జీవీ ఏ విషయంలో మాట్లాడినా అదో సంచలనమే. సినిమాలు, రాజకీయాలు కాకుండా వర్మ అమ్మాయిల గురించి కూడా అద్భుతంగా మాట్లాడుతాడు. ఏ అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది? ఎలా చూపిస్తే బాగుంటుంది? ఏ కెమెరా యాంగిల్ లో అమ్మాయి బ్యూటిఫుల్ గా ఉంటుంది అని వర్మకి తెలిసినంతగా ఏ దర్శకుడికి తెలియదేమో. అందుకే వర్మ సినిమాల్లోని హీరోయిన్స్ అందంగా, హాట్ గా కనిపిస్తూ ఉంటారు. శ్రీదేవి నుంచి రంగీలా ఊర్వశి వరకు… ఇప్పుడు అప్సరా రాణీతో సహా అందరూ తెరపై కనిపించి కుర్రాళ్లకి పగటి కలలు తెచ్చిన వాళ్లే. ఎప్పటికప్పుడు కొత్త అందం కోసం చూసే రామ్ గోపాల్ వర్మ, లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే చెప్పండి అంటూ పోస్ట్ చేసాడు.
సనాతన ధర్మంపై స్టాలిన్ సర్కారు సంచలన నిర్ణయం..!
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని పూర్తిగా నిర్మూలించాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగ్యూ లాంటిది, కాబట్టి దీనిని నిర్మూలించాలి, వ్యతిరేకించకూడదు అంటూ మాట్లాడారు. ఆ సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంత్రి ఉదయనిధిపై దేశంలోని హిందూ సంఘాలు, బీజేపీతో పాటు పలు పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి.
“ఈ ప్రశ్న అడగాల్సింది నన్నుకాదు”.. నిజ్జర్ హత్యపై జైశంకర్..
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెస్ట్రన్ మీడియాకు మరోసారి తనదైన శైలిలో చురకలు అంటించారు. గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ని ఇరుకున పెట్టేందుకు వెస్ట్రన్ మీడియా తీవ్రంగా ప్రయత్నించి అభాసుపాలైంది. తాజాగా కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హార్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై ఎస్ జైశంకర్ ని మీడియా ప్రశ్నించింది. దీనిపై వారికి మరోసారి దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చారు.
న్యూయార్క్ లో జరిగిన కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ ఈవెంట్ లో విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ పాల్గొన్నారు. కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య గురించి అక్కడి మీడియా ప్రశ్నించింది. హత్యకు సంబంధించిన సమాచారాన్ని ‘ఐవ్ ఐస్’ దేశాలు, ఎఫ్‌బీఐ పంచుకుందని వారి దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందని చెబుతున్నారని జైశంకర్‌ని మీడియా అడిగింది. ‘‘నేను ఫైవ్ ఐస్ దేశాల్లో భాగం కాదని, ఎఫ్‌బీఐలో సభ్యున్ని కదాని, మీరు తప్పుగా ఈ ప్రశ్నను నన్ను అడుగుతున్నారు’’ అని ఆయన అన్నారు.
గజ్వేల్ అభివృద్ధి కాలేదు అంటే సూర్యని మీద ఉమ్మేసినట్టే
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీపై మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. మొన్న షబ్బీర్ అలీ గజ్వేల్ కి వచ్చి గజ్వేల్ నియోజకవర్గం ఏం అభివృద్ధి చెందలేదు అన్నాడని, గజ్వేల్ అభివృద్ధి కాలేదు అంటే సూర్యని మీద ఉమ్మేసినట్టే అని హరీష్ రావు మండిపడ్డారు. సూర్యుడి మీద ఉమ్మితే మీ మొఖం మీదే పడుతుందని, ఇంత కంటే పెద్ద అబద్ధం ఏమన్నా ఉంటుందా అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. షబ్బీర్ అలీ మంత్రిగా ఉన్నప్పుడు తూప్రాన్ నుంచే కామారెడ్డికి పోయేవారని, అప్పుడు రోడ్డు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది షబ్బీర్ అలీకి తెలియదా..?.. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్వేల్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో తెలియదా..? ఇంకా ఇన్ని అబద్ధాలు మాట్లాడితే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా..? అని ఆయన ప్రశ్నించారు. మనోహరాబాద్ మండలం చేయాలన్న దశాబ్దల కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారన్నారు హరీష్ రావు.
పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. పిల్లలు ఆడుకుంటుండగా ఘటన..
పాకిస్తాన్‌లో బాంబు పేలుడు ధాటికి 8 మంది మరణించారు. రాకెట్ లాంచర్ మందుగుండుతో పిల్లలు ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. సింధ్ ప్రావిన్సులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన 8 మందిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కాష్మోర్-కంద్‌కోట్ ఎస్ఎస్పీ రోహిల్ ఖోసా మాట్లాడుతూ.. పిల్లలు గ్రౌండ్ లో ఆగుకుంటుండగా, రాకెట్ లాంచర్ షెల్ దొరికింది. దాన్ని ఇంటికి తీసుకువచ్చి, దాంతో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తితో సహా 8 మంది మరణించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు పాక్ పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకటో తేదీనే జీతాలు ఇస్తాం
నల్గొండ జిల్లా కేంద్రంలో హనుమాన్ నగర్ మొదటి విగ్రహా పూజల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్టి ద్వారా 70 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పోటీ పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించలేని అసమర్ధ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన విమర్శలు గుప్పించారు. నేటితో రాష్ట్ర ప్రజల విఘ్నాలు తొలగిపోవాలని వినాయకుడిని కోరుకున్నా అని ఆయన అన్నారు.
ఉండవల్లి మేధావి కాదు.. ఊసరవెల్లి అనే పరిస్థితికి వచ్చింది
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేడు (బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఉండవల్లి ఓ ఊసరవెల్లి అని ఆయన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును సీబీఐ అధికారులకి ఇవ్వాలని అడగడం ఏంటి అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ఈ కేసులో ఒక్క ఆధారం అయినా ఉందా అని అడిగారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టించారు దీనికి ఉండవల్లి అరుణ్ కుమార్ వత్తాసా పలికాడు అంటూ మాజీ మంత్రి మండి పడ్డారు. చంద్రబాబు నాయుడి పాలనలో బ్రాందీ సీసాలు చూపించి ఇప్పుడు జగన్ పాలనలో ఎందుకు కళ్లు మూసుకున్నావని అయ్యన్న ప్రశ్నించారు. సీఎం జగన్ పాలనలో తిరుపతి కొండపైన ఎన్నో అక్రమాలు జరిగుతున్నాయి.. అయినా ఉండవల్లి ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు.
సీజేఐ బెంచ్ ముందుకు చంద్రబాబు పిటిషన్ విచారణ.. కేసు మంగళవారానికి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో అనూహ్య పరిణామం జరిగింది. నేడు (బుధవారం) ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందుకు వచ్చింది.. న్యాయమూర్తులు ఈ కేసును విచారణ చేసేందుకు విముఖత చూపారు. ఈ పిటిషన్‌పై నాట్ బి ఫోర్ మీ అని ధర్మాసనంలోని జస్టిస్ భట్టి వ్యాఖ్యానించడంతో ఈ పిటిషన్ మరో బెంచ్‌కు బదిలీ అయింది. అయితే, ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దగ్గర ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా వెళ్లారు. సీజేఐ ధర్మాసనం ముందు చంద్రబాబు పిటిషన్‌ను ఆయన తరఫున లాయర్లు మెన్షన్ చేసే ప్రయత్నాలు సఫలం అయ్యాయి.
కెనడా రాకుండా పన్నూని నిషేధించాలి.. ప్రభుత్వాన్ని కోరిన హిందూ సంస్థ
కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా-కెనడాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. ఇదిలా ఉంటే కొందరు ఖలిస్తానీ ఎలిమెంట్స్ మాత్రం ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసేలా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతతలు పెంచేలా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఇండియాకు, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కెనడాలో ఆందోళన, నిరసన చేపడుతున్నారు. మరోవైపు సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హిందువులను టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు.
మణిపూర్‌లో ఉద్రిక్తత.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థుల హత్యకు వ్యతిరేకంగా నిరసనలు బుధవారం ఉదయం తీవ్రమయ్యాయి, ఇంఫాల్‌లో పోలీసు సిబ్బందితో ప్రదర్శనకారులు ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ హత్యలకు వ్యతిరేకంగా మంగళవారం రాత్రి ప్రధానంగా విద్యార్థుల నేతృత్వంలో భారీ నిరసనలు జరిగాయి. ప్రదర్శనకారులు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసం వైపు కవాతు చేయడానికి ప్రయత్నించారు, కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని కంగ్లా కోట సమీపంలో నిరసన కొనసాగింది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది, పరిస్థితిని అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పుడు, పోలీసు సిబ్బంది లాఠీచార్జి చేసి ఆందోళనకారులపై బాష్పవాయువు షెల్స్‌ను ప్రయోగించారు. అనేక మంది నిరసనకారులు గాయపడ్డారు, వారిలో కొందరికి తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది.