FBI warned US Khalistani elements: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. ఇప్పుడు ఈ హత్య కెనడా, ఇండియా మధ్య దౌత్యపరమైన వివాదానికి కారణమైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా భారత దౌత్యవేత్తను బహిష్కరిస్తే , భారత్ కూడా దెబ్బకు దెబ్బ…
India-Canada Dispute: కెనడా- భారత్ మధ్య ఉద్రిక్తత తగ్గడం లేదు. ఈ గొడవ కారణంగా వ్యాపార ప్రపంచం ప్రభావితం అవుతుంది. ఆనంద్ మహీంద్రా కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కెనడియన్ సంస్థ రేసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్‌తో తన భాగస్వామ్యాన్ని ముగించుకుంది.
Justin Trudeau: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని వ్యాఖ్యలు చేస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇంటా, బయట వ్యతిరేకత ఎదురుకొంటున్నారు. భారత్‌ని కాదని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి కెనడా మిత్రదేశాలు వ్యవహరించే పరిస్థితి లేకపోవడంతో కెనడా ప్రభుత్వానికి చుక్కెదురు అవుతోంది. ఇదిలా ఉంటే కెనడాలో జస్టిన్ ట్రూడో తన ప్రజాధరణ కోల్పోతున్నారని తాజాగా ఓ సర్వేలో తేలింది.
Canada-India Issue: కెనడా- భారత్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రభావం ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. కెనడియన్ డబ్బు భారతీయ స్టాక్ మార్కెట్‌లోని అనేక కంపెనీలలో పెట్టుబడి పెట్టబడింది.
India-Canada: భారత్, కెనడా మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. కెనడా పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని భారత్ ప్రస్తుతానికి నిలిపివేసింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య మహీంద్రా గ్రూప్ కూడా కెనడాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Justin Trudeau: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పై ఆరోపణలు చేశారు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని అన్నారు. తమ వద్ద విశ్వసనీయ కారణాలు, సమాచారం ఉందని వెల్లడించారు. ఖలిస్తాన్ వేర్పాటువాదానికి మద్దతు పలుకుతూ,
Canada: ఇటీవల భారతదేశం ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును నిర్వహించింది. సభ్యదేశాలతో పాటు ఆహ్వానిత దేశాలకు చెందిన అధినేతలు, అధికారులు మొత్తం 30 మందికిపైగా అగ్రనేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
Visa: ఇండియా, కెనడాల మధ్య ఖలిస్తాన్ ఉగ్రవాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కెనడా ప్రధాని ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ఇండియా కారణం అంటూ ఆరోపణలు చేశారు. అంతే కాకుండా సీనియర్ భారత దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించారు. అయితే ఇందుకు ప్రతిగా భారత్ కూడా కెనడియన్ సీనియర్ దౌత్యవేత్తను 5 రోజుల్లో ఇండియా వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా ఆరోపణల్ని అసంబద్ధ, ప్రేరేపిత ఆరోపణలుగా ఖండించింది.
Khalistani Terrorist Sukha Duneke Killed In Canada Gang War: ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య ప్రస్తుతం తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో మరో ఘటన చోటుచేసుకుంది. కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురైనట్లు ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు పేర్కొన్నాయి. విన్నిపెగ్‌లో బుధవారం రాత్రి ప్రత్యర్థి గ్యాంగ్ జరిపిన దాడిలో గ్యాంగ్‌స్టర్ సుఖ్‌దోల్ సింగ్…