Canada:ముస్లింలనే టార్గెట్ చేసి దాడులు చేసే ఓ పిచ్చివాడిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. టొరంటోకు చెందిన చాండ్లర్ మార్షల్ డజనుకు పైగా కేసులను ఎదుర్కొంటున్నాడని పోలీసులు తెలిపారు.
Israel-Hamas War: గాజాలో హమాస్ ఉగ్రసంస్థను తుడిచిపెట్టేలా ఇజ్రాయిల్ దాడులు నిర్వహిస్తోంది. భూతలదాడుల్లో హమాస్ ఉగ్రవాదలను హతమారుస్తోంది. హమాస్ ఉగ్రసంస్థకు కేంద్రాలుగా ఆస్పత్రులను ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. ఈ ఆస్పత్రి కిందనే హమాస్ కమాండ్ సెంటర్ తో పాటు కీలక ఉగ్రవాదులు ఉన్నట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది.
Canada: కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం రోజురోజుకు పెరుగుతోంది. ఖలిస్తాన్ పేరు చెబుతూ కొందరు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. కెనడాలోని హిందూ మందిరాలపై దాడులు చేయడంతో పాటు హిందువులను బెదిరించడం కూడా గతంలో చూశాం. తాజాగా ఖలిస్తానీలు మరోసారి రెచ్చిపోయారు. దీపావళి వేడుకల్లోకి వచ్చి ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేశారు.
Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్‌జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల భారత్‌ను బెదిరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 19న ఎయిరిండియా విమానాల్లో సిక్కులు ఎవరూ ప్రయాణించొద్దని, ప్రయాణిస్తే ప్రాణాలకు భద్రత ఉండదని, ప్రపంచవ్యాప్తంగా ఆ విమానాలను ఎక్కడా అనుమతించబోమని హెచ్చరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం మూతపడుతుందని, దాని పేరు మారుస్తామని హెచ్చరించారు.
Canada: సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు బరువు సగటున 3.5 కిలోలు ఉంటుంది. 2.5 కిలోల నుంచి 4.5 కిలోల బరువును సాధారణంగా పరిగణిస్తారు. ఇది ఆరోగ్యం ఉన్న శిశువు బరువు. కొన్ని సందర్భాల్లో పుట్టిన సమయంలో పిల్లల బరువు దీని కన్నా తక్కువగా లేదా ఎక్కువగా ఉండటం చూస్తుంటాం. కానీ చాలా అరుదుగా కొందరు మాత్రం బాహుబలిగా జన్మిస్తుంటారు. తాజాగా కెనడాలో ఓ పిల్లాడి జననం 2010 నుంచి ఉన్న రికార్డులను తుడిపేసింది.
Hardeep Singh Nijjar: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా-కెనడా దేశాల మధ్య ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంది. తాజాగా కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జూన్ నెలలో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే ప్రాంతంలో గురుద్వారా ముందు నిజ్జర్‌ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు.
Canada: కెనడాలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. మరిన్న వలసలను కెనడా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వచ్చే ఏడాది 4.85 లక్షల మంది శాశ్వత నివాసితులను ఆహ్వానించనుంది. 2025 నాటికి 5 లక్షల మందిని స్వాగతిస్తామని ప్రకటించింది. దేశంలో వృద్ధాప్య జనాభా పెరగడంతో పాటు కీలక రంగాల్లో కార్మికుల కొరతని ఎదుర్కొంటోంది. భారతదేశం వంటి దేశాల నుంచి కొత్తగా అర్హత కలిగిన నిపుణుల సాయంతో కెనడా ఆర్థికవృద్ధిని పెంచుకోవాలని అనుకుంటోంది. వలసదారులు కెనడా ఆర్థిక వ్యవస్థకు…
Survival Story: మహా సముద్రంతో తప్పిపోవడం అంటే చావుకు దగ్గర కావడమే, ఇలా ఎంతో మంది మరణించారు. అయితే కొందరు మాత్రం ప్రాణంపై ఆశ వదలకుండా కొన్ని నెలల పాటు సముద్రంలో లేకపోతే దిక్కులేని ద్వీపాల్లో చిక్కుకున్నప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు. మనుగడ కోసం వారి పోరాటమే వారిని కాపాడింది. ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి.
నిజ్జర్ హత్య ఆరోపణలతో భారత్- కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అటువంటి పరిస్థితిలో కెనడా కన్జర్వేటివ్ పార్టీ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు పియర్ పోయిలీవ్రే మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న తరువాత, ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశంతో సంబంధాల విలువను అర్థం చేసుకోలేకపోయారు అని ఆయన అన్నారు.
Dabur India: డాబర్ ఉత్పత్తులు క్యాన్సర్లకు కారణమవుతున్నాయని ఆరోపిస్తూ కొంతమంది కస్టమర్లు అమెరికా, కెనడాల్లో కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. హెయిర్ రిలాక్సర్ ఉత్పత్తుల వాడకం అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమైందని ఆరోపిస్తూ కస్టమర్లు యూఎస్, కెనడాలో కేసులు వేసిన కంపెనీలలో తమ అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయని డాబర్ ఇండియా బుధవారం తెలిపింది.