UK: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. కెనడా, యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా యూకేలో రాడికల్ సిక్కు ఎలిమెంట్స్ బ్రిటన్ లోని భారత రాయబారిని గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. యూకే స్కాట్లాండ్ ఆల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గో గురుద్వారా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భారత రాయబారి దొరైస్వామిని ఖలిస్తాన్ వేర్పాటువాదులు అడ్డుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
గురుద్వారా మేనేజింగ్ కమిటీ ఆహ్వానం మేరకు దొరైస్వామి గురుద్వారాకు వెళ్లారు. అయితే ఆయనను కొందరు ఖలిస్తానీ మద్దతుదారులు అడ్డుకున్నారు. లోపలకి వెళ్లనీయలేదు, గురుద్వారా కమిటీ మెంబర్లను కూడా బెదిరించారు. స్వల్ప ఘర్షణ కూడా చోటు చేసుకుంది, చేసేదేం లేక దొరైస్వామి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనను భారత ప్రభుత్వం యూకే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. స్థానికంగా ఈ ఘటనపై పోలీస్ కేసు అయినట్లు తెలుస్తోంది.
Read Also: ODI WC 2023: ఇండియా కాదు.. వరల్డ్ కప్ గెలిచేది ఆ దేశమే అంటున్న గవాస్కర్
ప్రస్తుతం ఖలిస్తాన్ వివాదం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై కెనడా, ఇండియా దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తుతెలియని వ్యక్తులు కెనడాలోని సర్రే నగరంలో చంపేశారు. అయితే ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు.
ఈ ఆరోపణలే కాకుండా కెనడా నుంచి సీనియర్ భారత దౌత్యవేత్తను బహిష్కరించింది. దీనికి భారత్ కూడా గట్టిగానే బదులిచ్చింది. భారత్ నుంచి కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడా ఆరోపణల్ని అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలుగా భారత్ కొట్టి పారేసింది.
K-terrorists block entry of Indian ambassador to UK inside Glasgow gurudwara –
Gurdwara Comittee invites the Indian High Commissioner. K's learn about it and reach the glasgow gurdwara and blocked his entry. Insulted the Comittee members.
They even tried to open the car door… pic.twitter.com/89f9Y1pIsD
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 30, 2023