Sprite Cool Drink: రంగు మార్చిన ‘స్ర్పైట్’.. 60 ఏళ్ల తర్వాత తొలిసారి..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sprite Cool Drink bottle colour changed: కూల్‌డ్రింక్ అనగానే చాలా మంది స్ర్పైట్ తాగుతుంటారు. ఎందుకంటే సోడా తరహాలో ఉండటమే కాకుండా స్ర్పైట్ రుచి చాలా బాగుంటుంది. పాన్ షాపులకు వెళ్లినా.. షాపింగ్ మాళ్లకు వెళ్లినా మనకు ఆకుపచ్చని స్ర్పైట్ బాటిల్స్ దర్శనమిస్తూ ఆకర్షిస్తుంటాయి. అయితే ఇప్పటివరకు స్ర్పైట్ బాటిల్ గ్రీన్ కలర్‌లోనే ఉంటూ వచ్చింది. 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్ర్పైట్ తన బాటిల్ కలర్ మార్చుకుంటోంది. ఈ మేరకు పర్యావరణ అనుకూలమైన తెల్లని రంగు బాటిల్‌తో ఆకుపచ్చ రంగును భర్తీ చేస్తోంది. స్ప్రైట్ మాతృ సంస్థ కోకో కోలా కంపెనీ కొత్త బాటిల్ డిజైన్‌ను ఆగస్ట్ 1 నుంచి విడుదల చేయనుంది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. చాన్నాళ్ల తర్వాత బాటిల్ ప్యాకేజింగ్‌ను మార్చాలని నిర్ణయించామని.. రీ సైక్లింగ్‌కు వీలుగా ఉండేలా రంగుల్లేని ప్లాస్టిక్ ఉపయోగించాలని నిర్ణయించడమే తాము బాటిల్ రంగును మార్చడానికి కారణమని వివరించారు. ప్రస్తుతానికి అమెరికాలో స్ర్పైట్ కలర్ ను మార్చినట్టు ప్రకటించిన కొకకోలా సంస్థ.. తర్వాత దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అమలు చేస్తామని తెలిపింది.
Read Also: Mystery incident: ఆటో బేరం వచ్చిందని వెళ్లాడు..నాలుగురోజుల తర్వాత?
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
కాగా స్పైట్ ఆకుపచ్చ బాటిల్ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (PET)తో తయారు చేయబడింది. ఇది ప్రధానంగా తివాచీలు, దుస్తులు వంటి సింగిల్ యూజ్ ఐటమ్‌గా గుర్తించబడింది. ఈ బాటిళ్లను రీసైక్లింగ్ చేయడం కష్టం. అందుకే కొత్త సీసాల కోసం ఆకుపచ్చ రంగు కంటే స్పష్టమైన ప్లాస్టిక్‌ను తిరిగి ఉపయోగించడం సులభమని కోకో కోలా కంపెనీ అభిప్రాయపడుతోంది. 1961లో అమెరికాలో స్ర్పైట్‌ను మొదటిసారిగా ప్రారంభించబడినప్పటి నుండి ఇది ఆకుపచ్చ రంగులో ప్యాక్ చేయబడిన సీసాలలో మాత్రమే విక్రయించారు. కోకోకోలా కంపెనీ బెస్ట్ సెల్లింగ్ డ్రింక్స్‌లో స్ర్పైట్ ఒకటి. ఇన్నేళ్లలో బాటిళ్ల ఆకారం మారినా.. స్ర్పైట్ ఉండే ఆకుపచ్చ రంగు మాత్రం మారలేదు. కానీ ఇప్పుడు ఆ ఆకుపచ్చ రంగుకు స్ర్పైట్ గుడ్ బై చెప్పేస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో… పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!