Rice Rates: మన దేశంలో అన్ని రకాల బియ్యం ధరలు జూన్ నెల నుంచి ఇప్పటిదాక 30 శాతం వరకు పెరిగాయి. విదేశాల నుంచి బియ్యానికి డిమాండ్ పెరగటంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో వరి పంట సాగు విస్తీర్ణం తగ్గటంతో ఈ పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా తదితర దేశాలకు బియ్యం ఎగుమతులు పెరిగాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల రేట్లు పెరగటంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరో బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
రెపో రేటు పెంపు!
రేపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి విలువను పెంచేందుకు మరియు రుణాలకు చెక్ పెట్టేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని అంటున్నారు. ఏప్రిల్ 4వ తేదీన 8 లక్షల కోట్లకు పైగా ఉన్న మిగులు ద్రవ్యం జులై 28వ తేదీ నాటికి లక్ష కోట్ల లోపుకి తగ్గిపోవటం గమనించాల్సిన విషయం.
Amit Shah and JP Nadda: బీహార్‌లో అమిత్‌షా.. పదేపదే తెలంగాణ ప్రస్తావన..! ఏంటి విషయం..?
నేడూ 5జీ వేలం
5జీ స్పెక్ట్రం వేలం ఇవాళ 7వ రోజూ కొనసాగనుంది. 6 రోజుల్లో దాఖలైన బిడ్‌ల విలువ లక్షలన్నర కోట్ల మార్క్‌ని దాటింది. ఇప్పటివరకు 37 రౌండ్లు వేలం నిర్వహించగా ఈరోజు 38వ రౌండ్ నుంచి ఆక్షన్‌ను ప్రారంభిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంత మార్కెట్‌పై టెలికం సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 18 వందల మెగా హెర్ట్‌జ్ బ్యాండ్‌కి డిమాండ్ నెలకొనటంతో రేటు కూడా భారీగా పెరిగింది.
నియో బ్యాంక్ ప్లాన్
వచ్చే మూడేళ్లలో 10 మిలియన్ల చిన్న వ్యాపారాలను ప్రారంభించాలని ఓపెన్ అనే నియో బ్యాంక్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. గూగుల్ సంస్థతోపాటు టైగర్ గ్లోబల్ అనే కంపెనీ కూడా ఈ బ్యాంక్ ఏర్పాటుకు సాంకేతికంగా సహకరిస్తున్నాయి. స్మాల్ అండ్ మైక్రో ఎంటర్‌ప్రైజ్‌లు బిజినెస్ ఫైనాన్స్‌ల పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను టెక్నాలజీ సాయంతో పరిష్కరించటమే ఈ నియో బ్యాంక్ లక్ష్యం.
మధ్య ఆసియాపై ఫోకస్
మధ్య ఆసియా దేశాలతో వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవటంపై ఇండియా దృష్టి పెట్టింది. ఇరాన్‌లోని చాబహార్ నౌకాశ్రయం ద్వారా స్వేచ్ఛా వాణిజ్య మార్గంలో ఈ కార్యకలాపాలను నిర్వహించాలని ఆశిస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ నిన్న ఆదివారం సెంట్రల్ ఆసియా దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.
లేట్ ఫీజుతో ఐటీఆర్‌లు
ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు నిన్నటితో గడువు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఐటీఆర్‌లను సమర్పించనివాళ్లు లేట్ ఫీజుతో డిసెంబర్ దాక దాఖలు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆదివారం అర్ధరాత్రి వరకు మొత్తం 5 కోట్ల 73 లక్షల ఐటీఆర్‌లు వచ్చినట్లు వెల్లడించింది. చివరి ఒక్క గంటలోనే 4 లక్షల 60 వేలకు పైగా ఐటీఆర్‌లు ఆన్‌లైన్‌లో దాఖలయ్యాయని పేర్కొంది.