EPFO News: ఈపీఎఫ్‌ఓలో నమోదవుతున్న ఉద్యోగుల సంఖ్య వరుసగా 3వ నెలా.. తగ్గేదేలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO News: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో మూడు నెలల నుంచి ప్రతి నెలా 10 లక్షల మందికి పైగానే ఉద్యోగులు నమోదవుతుండటం విశేషం. ఏప్రిల్‌లో 10 లక్షల 9 వేలు, మే నెలలో 10 లక్షల 7 వేలు, జూన్‌లో 10 లక్షల 54 మందికి పైగా చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. సంఘటిత రంగంలో వరుసగా మూడు నెలల నుంచి ఈ స్థాయిలో ఉపాధి లభిస్తుండటం చెప్పుకోదగ్గ విషయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
‘జీఐసీ’ ఫండ్ రైజింగ్
Also Read
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
బాండ్లను జారీ చేయటం ద్వారా 25 వందల కోట్ల రూపాయల వరకు నిధులను సమీకరించాలని జీఐసీ హౌజింగ్ ఫైనాన్స్ సంస్థ భావిస్తోంది. వచ్చే నెల 23వ తేదీన జరగనున్న కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఈ మేరకు షేర్ హోల్డర్ల నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తోంది. మూలధన వనరులను పెంచుకోవటానికి ఈ బాండ్లను ప్రైవేట్ ప్లేస్‌మెంట్ బేసిస్‌లో జారీ చేయనుంది.
సీనియర్ డైరెక్టర్లు.. లేటెస్ట్ సినిమాలు..
ఐటీకి రూ.28 కోట్లు
ఆదాయపు పన్ను విభాగానికి సుమారు లక్ష ఐటీఆర్-యు ఫైలింగ్స్ దాఖలు కాగా ట్యాక్స్‌ల రూపంలో దాదాపు 28 కోట్ల రూపాయలు సమకూరాయి. ఈ కొత్త ఐటీ రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియను 2022-23 బడ్జెట్‌లో నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ని ప్రవేశపెట్టిందని సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు.
2 వేలకు పైగా డిలీట్
ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో 2 వేలకు పైగా లోన్ యాప్‌లను ఇండియా ప్లేస్టోర్ నుంచి తొలగించినట్లు గూగుల్ పేర్కొంది. రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరించటం, తప్పుడు సమాచారాన్ని చూపించటం, ఆఫ్‌లైన్ బిహేవియర్ సరిగా లేకపోవటం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధి చెప్పారు. రానున్న రోజుల్లో విధానాలపరంగా మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
అదనపు సీట్లు ప్లీజ్
రెండు దేశాల మధ్య విమాన ప్రయాణికుల రాకపోకల కోసం మరో 50 వేల సీట్లను అందుబాటులోకి తేవాలని దుబాయ్ ఇండియాని కోరింది. తమ విమానాలను ఇండియాలోని మరిన్ని ప్రాంతాలకు అనుమతించాలని కూడా రిక్వెస్ట్ చేసింది. భారతీయ విమాన ప్రయాణికులకు దుబాయే పెద్ద గమ్యస్థానం. ఈ నేపథ్యంలో 2014 నుంచి ఇరు దేశాల మధ్య వారానికి 65 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉంటున్నాయి. వాటిని పెంచాలని దుబాయ్ తాజాగా అడిగింది.
హెచ్‌డీఎఫ్‌సీ పెట్టుబడి
గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 9.94 శాతం వాటా కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 120 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థ ఇండియాలోని జీవిత బీమా రంగంలో వ్యాపారం నిమిత్తం లైసెన్స్ కోసం ఎదురుచూస్తోంది. కెనడాకు చెందిన కామేష్ గోయెల్ అనే బిలియనీర్ దీనికి ప్రమోటర్. ఈ సంస్థలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెండు విడతల్లో 50 నుంచి 70 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..