RBI circular: గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో మార్పు చోటుచేసుకుంది. ఈ పథకంలో భాగంగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బంగారాన్ని మెచ్యూరిటీ గడువు కన్నా ముందే తీసుకోవాలంటే డబ్బులు మాత్రమే చెల్లిస్తారు. గోల్డ్ ఇవ్వరు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
IndiGo Revenue Soars. But: దేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్స్ అయిన ఇండిగో ఆదాయం రికార్డ్ స్థాయిలో 328 శాతం పెరిగింది. తద్వారా 12,855 కోట్ల రూపాయలు దాటింది. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల ఫలితాలను వెల్లడించింది.
Loans Write Off: గడచిన ఐదేళ్లలో బ్యాంకులు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల లోన్లను టెక్నికల్‌గా రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. గత నాలుగేళ్లలో 10 వేల 306 మంది ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె.కరాడ్ రాతపూర్వకంగా తెలిపారు.
Record Level Car Sales: జులై నెలలో 3 లక్షల 42 వేల 326 కార్లు అమ్ముడుపోయాయి. ఒక నెలలో ఇన్ని కార్ల విక్రయాలు జరగటం ఇదే మొదటిసారి. ద్రవ్యోల్బణం మరియు వడ్డీ రేట్లు పెరగనున్నాయనే ఆందోళన నేపథ్యంలో కూడా ఇలా రికార్డ్ స్థాయి ఫలితాలు వెలువడటం విశేషమే.
Income Tax Returns: 2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే ఆఖరు తేదీ ముగిసిపోయింది. జూలై 31లోగా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసి ఇ-వెరిఫై పూర్తి చేయలేదా.. అయితే వెంటనే ఆ పని పూర్తి పనిచేయండి. ఆగస్టు 1 నుంచి ఈ గడువును 30 రోజులకు తగ్గిస్తూ ఆదాయపు పన్ను విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు ఈ గడువు 120 రోజులు ఉండేది. సాధారణంగా ఆధార్…
Rice Rates: మన దేశంలో అన్ని రకాల బియ్యం ధరలు జూన్ నెల నుంచి ఇప్పటిదాక 30 శాతం వరకు పెరిగాయి. విదేశాల నుంచి బియ్యానికి డిమాండ్ పెరగటంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో వరి పంట సాగు విస్తీర్ణం తగ్గటంతో ఈ పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా తదితర దేశాలకు
Sprite Cool Drink bottle colour changed: కూల్‌డ్రింక్ అనగానే చాలా మంది స్ర్పైట్ తాగుతుంటారు. ఎందుకంటే సోడా తరహాలో ఉండటమే కాకుండా స్ర్పైట్ రుచి చాలా బాగుంటుంది. పాన్ షాపులకు వెళ్లినా.. షాపింగ్ మాళ్లకు వెళ్లినా మనకు ఆకుపచ్చని స్ర్పైట్ బాటిల్స్ దర్శనమిస్తూ ఆకర్షిస్తుంటాయి. అయితే ఇప్పటివరకు స్ర్పైట్ బాటిల్ గ్రీన్ కలర్లోనే ఉంటూ వచ్చింది. 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్ర్పైట్ తన బాటిల్ కలర్ మార్చుకుంటోంది. ఈ మేరకు పర్యావరణ అనుకూలమైన తెల్లని…
Life Insurance Corporation: మన దేశంలో ఎల్ఐసీ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. భారతీయ జీవిత బీమా సంస్థ(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ఎల్ఐసీ) అంటే ప్రతిఒక్కరికీ భరోసా. జీవితంపై ధీమా.
Business Headlines: హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మాస్యుటికల్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ సంస్థ నికర లాభం ఏకంగా 108 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 3 నెలల్లో 571 కోట్లు మాత్రమే ప్రాఫిట్ రాగా ఈసారి 11 వందల 88 కోట్లు వచ్చాయి.
Gold ans Silver Prices: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం ధరలు పెరగడం ఓ రకంగా షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మాసంలో శుభాకార్యాలు భారీస్థాయిలో జరుగుతాయి. దీంతో పసిడికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే పసిడికి రెక్కలు రావడంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించిన వాళ్లు ఊసురుమంటున్నారు. ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో నెలకొన్న అనిశ్చితులు, బంగారం ధరల…