SAIL Entered Trillion Club: లక్ష కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కలిగిన ఎలైట్ క్లబ్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ జాబితాలోకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలిసారిగా చేరింది. 2021-22 మధ్య కాలంలో 18.73 మిలియన్ టన్నుల హాట్ మెటల్‌ని మరియు 17.36 మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్‌ని ఉత్పత్తి చేసింది. ఈ సంస్థకు సంబంధించి ఇదే ఇప్పటివరకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావటం గమనించాల్సిన అంశం. ఆపరేషన్ పెర్ఫార్మెన్స్‌తోపాటు అత్యధిక లాభాలను ఆర్జించటంతో టర్నోవర్‌లో భారీ గ్రోత్ నెలకొందని చైర్‌పర్సన్ వెల్లడించారు.
హైదరాబాద్‌లో సిలికాన్ ల్యాబ్స్ ఆఫీస్
ఇంజనీరింగ్ ఉత్పత్తులతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా పనిచేసే ప్రొడక్టులను డెవలప్ చేసే సిలికాన్ ల్యాబ్స్ హైదరాబాద్‌లో ఆఫీసును ప్రారంభించింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో ప్రస్తుతం 500 మంది ఎంప్లాయ్స్ ఉండగా ఈ సంఖ్యను వచ్చే మూడేళ్లలో 15 వందలకి పెంచనున్నట్లు తెలిపారు. అంటే భవిష్యత్తులో మరో వెయ్యి మందిని రిక్రూట్ చేసుకుంటామని వెల్లడించారు. వైర్‌లెస్ ఉత్పత్తులు, ఇండస్ట్రియల్, కమర్షియల్, హౌజ్‌హోల్డ్ అప్లికేషన్స్, సొల్యూషన్లను ఈ సెంటర్‌లో అభివృద్ధి చేయనున్నారు.
read also: Rupee Effect on Foreign Education: రూపాయి విలువ పతనం.. భారతీయ విద్యార్థులకు భారం..
ఫ్రీ రేషన్‌తో రూ.44,762 కోట్ల భారం
దేశవ్యాప్తంగా పేదలకు ఉచితంగా రేషన్ అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. కొవిడ్ నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో ప్రారంభమైన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తాజా నిర్ణయంతో ఈ ఏడాది డిసెంబర్ వరకు అమల్లో ఉంటుంది. దసరా, దీపావళి తదితర ప్రధాన పండుగలతోపాటు గుజరాత్ మరియు హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై 44,762 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
ఎట్టకేలకు స్టాక్ మార్కెట్ల వరుస భారీ నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఎర్లీ అవర్స్‌లో 261 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 56859 వద్ద ట్రేడింగ్ కాగా ఇంట్రాడేలో వంద పాయింట్లకు పైగా నష్టాల్లోకి జారుకుంది. నిఫ్టీ సైతం 84 పాయింట్ల ప్లస్ స్థితి నుంచి నష్టాల అంచుల్లో 16859కి పైన ట్రేడింగ్ అవుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.56 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.