One Man Two Jobs: ఒక ఉద్యోగి రెండు సంస్థల్లో పనిచేయటం సరికాదని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. అది మోసంతో సమానమని అభిప్రాయపడ్డారు. మూన్‌లైటింగ్‌గా పేర్కొనే ఈ పథకానికి ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే.
Ola Cabs Fined By Court: ప్రస్తుత రోజుల్లో ఒక ఫ్యామిలీ బయటకు వెళ్లాలంటే కారు ఉండాల్సిందే. అయితే సొంత కారు లేని వాళ్లు క్యాబ్‌లపై ఆధారపడుతున్నారు. దీంతో ఓలా లేదా ఉబర్ క్యాబ్‌లను బుక్ చేసుకుంటున్నారు. కానీ ఓలా, ఉబర్లు సామాన్యులను పిండి పిప్పి చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓలా క్యాబ్స్‌కు హైదరాబాద్ వినియోగదారుల కోర్టు భారీ జరిమానా విధించింది. కేవలం 4-5 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఓ కస్టమర్‌కు ఓలా క్యాబ్స్…
Boycott Amazon in social media: ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా అమెజాన్ కొన్ని వస్తువులను విక్రయిస్తుందని ఆరోపిస్తూ #Boycott_Amazon హాష్ ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. స్వస్తిక్ గుర్తుతో ఫ్లోర్ మ్యాట్స్‌తో పాటు కృష్ణాష్టమి పండగ సందర్భంగా శ్రీకృష్ణుడిని అవమానించేలా పోస్టర్లను అమెజాన్‌లో ఆన్లైన్లో అమ్మకానికి ఉంచిందని నెటిజన్లు మండిపడుతున్నారు. అభ్యంతర కరమైన ఫోటోలను షేర్ చేసి హిందువుల మనోభావాల్ని అమెజాన్ దెబ్బతీసిందంటూ ఆగ్రహం వ్యక్తం…
ICICI Bank: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువగా ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై వివిధ కాల వ్యవధులకు వడ్డీ రేట్లను సవరించినట్లు వివరించింది. 7 రోజుల నుండి 29 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ 2.75 శాతం వడ్డీ రేటును ఇస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.…
IRCTC Fund raising: ఇండియన్ రైల్వేస్‌కి టికెట్ బుకింగ్ సర్వీస్ అందిస్తున్న ఐఆర్సీటీసీ.. ప్రయాణికుల సమాచారంతో వెయ్యి కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కన్సల్టెంట్‌ని ఎంపిక చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీలతో నిర్వహించే
Wipro: ప్రముఖ ఐటీ రంగ సంస్థ విప్రో తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభాలు తగ్గడంతో ఈ ఏడాది వేరియబుల్ పే నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని విప్రో ఖండించింది. సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో ఎలాంటి మార్పు ఉండదని విప్రో స్పష్టం చేసింది. తాము తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని.. అనుకున్న ప్రకారమే తమ ఉద్యోగులకు వేరియబుల్ పే అందిస్తామని తెలిపింది. మీడియాలో వస్తున్నట్లు వేతనాల పెంపును…
FlipKart: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు కేంద్ర వినియోగదారుల హక్కుల రక్షణ అథారిటీ (సీసీపీఏ) భారీ జరిమానా విధించింది. సరైన నాణ్యత లేని ప్రెషర్ కుక్కర్లను వినియోగదారులకు విక్రయించినందుకు లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని ఫ్లిప్ కార్ట్‌ను కేంద్ర వినియోగదారుల హక్కుల రక్షణ అథారిటీ ఆదేశించింది. నాణ్యతలేని వస్తువులను విక్రయించడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో నాసిరకం కుక్కర్లు విక్రయించారని దాఖలైన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ మేరకు…