Iran-Israel War: ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంలోకి లెబనాన్ ఎంట్రీ.. ఇజ్రాయెల్‌పై బాంబుల వర్షం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hezbollah Enters Iran-Israel War: ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమెరికా- ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఖమేనీ మృతిపై ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి లెబనాన్ ఎంట్రీ ఇచ్చింది.. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై హిజ్జుల్లా గ్రూప్ దాడికి దిగింది.. నార్త్ ఇజ్రాయెల్లోని హైఫా టార్గెట్గా హిజ్బుల్లా తీవ్రవాదుల ఎటాక్ చేస్తున్నారు.. ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ దాడి ప్రారంభించింది.. సౌత్ లెబనాన్లో హిజ్బుల్లా తీవ్రవాదులే లక్ష్యంగా ఎటాక్ చేస్తోంది.. 2024లో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.. అయితే.. తాజాగా ఖమేనీ మృతి తర్వాత మళ్లీ దాడులు మొదలయ్యాయి..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
లెబనాన్ భూభాగం నుంచి ప్రయోగించిన రాకెట్లు, డ్రోన్లు సోమవారం తెల్లవారుజామున ఉత్తర ఇజ్రాయెల్ అంతటా వ్యాపించాయి. ఇరాన్‌కు మద్దతుగా నిలిచిన హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ ఈ దాడుల్లో పాల్గొంటున్నట్లు ప్రకటించింది. సోమవారం రాత్రి ఒకటి గంట దాటిన వెంటనే ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫా నగరం, పరిసర ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. ప్రారంభంలో ఈ రాకెట్ దాడులు ఇరాన్ నుంచే జరిగాయని అనుమానించినప్పటికీ, తర్వాత ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్పష్టత ఇచ్చాయి. ఈ దాడుల మూలం లెబనాన్ అని అధికారికంగా ప్రకటించాయి. సైనిక వర్గాల సమాచారం ప్రకారం, ప్రయోగించిన రాకెట్లలో ఒకటిని గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. మరికొన్ని రాకెట్లు ఖాళీ ప్రదేశాల్లో పడేలా అనుమతించబడినట్లు తెలిపారు. దీంతో పెద్దగా ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?