'Aha' Decision: తెలుగు, తమిళ కంటెంట్ ప్రొవైడర్ అయిన 'ఆహా' ఓటీటీ.. ఆదాయం కోసం నెట్‌ఫ్లిక్స్ బాటలో పయనిస్తోంది. చిన్న పట్టణాల నుంచి కూడా సబ్స్క్రైబర్లను ఆకర్షించడంతోపాటు యాడ్స్‌తో కూడిన వీడియోలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హైబ్రిడ్ మోడల్‌కి మారుతోంది.
Ratan Tata: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడంలో ముందుంటారు. తాజాగా ఆయన గుడ్ ఫెల్లోస్ అనే స్టార్టప్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. మంగళవారం జరిగిన ఈ స్టార్టప్ కంపెనీ ప్రారంభోత్సవంలో రతన్ టాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటరితనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక తోడుంటే బాగుండు అని ఒంటరిగా సమయం గడిపే వరకు.. ఒంటరితనమంటే తెలియదని రతన్ టాటా వ్యాఖ్యానించారు. అలాగే వాస్తవంగా వయసు…
Milk Prices Hiked Again: దేశవ్యాప్తంగా మరోసారి పాలధరలు పెరిగాయి. గత నెలలో జీఎస్టీ కారణంగా పెరిగిన పాలధరలు ప్రస్తుతం మరోసారి సామాన్యులకు భారంగా తయారయ్యాయి. పాల సేకరణ, ఇతర వ్యయాలు పెరిగిపోవడంతో పాల ధరలను పెంచుతున్నట్లు అమూల్, మదర్ డైరీలు వేర్వేరుగా ప్రకటించాయి. అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ శక్తి పాల ధరలను లీటరుకు రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) తెలియజేసింది. కొత్త ధరలు బుధవారం…
Mahatma Gandhi NREGS: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జులై నెలలో వర్క్ జనరేషన్ 50 శాతం పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మరియు వ్యవసాయేతర కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతుండటంతో కార్మికులు వాటి ద్వారా ఉపాధి పొందుతున్నారు.
Jio 5G Smart Phone: దేశంలో త్వరలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో అన్ని మొబైల్ కంపెనీలు 5జీ స్మార్ట్ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తయారుచేస్తోంది. ఈ ఏడాది చివర్లోగా ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వీలైతే దసరా నాటికి రిలయన్స్ జియో నుంచి 5జీ స్మార్ట్ ఫోన్ రానుంది. దీంతో జియో ఫోన్లో ఎలాంటి…
Telangana Voice: మన దేశంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తప్పనిసరిగా 10 శాతం విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిందేనంటూ గతంలో ఒకటికి రెండు సార్లు హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తాజాగా వెనక్కి తగ్గింది.
RBI Update: కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బోర్డుకి నలుగురు స్వతంత్ర డైరెక్టర్లను మళ్లీ నామినేట్ చేసింది. సతీష్ కాశీనాథ్ మరాఠే, స్వామినాథన్ గురుమూర్తి, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది.. పార్ట్ టైమ్, నాన్ అఫిషియల్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు.
Netflix Games: వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ప్రారంభించిన గేమింగ్ బిజినెస్ నత్తనడకన సాగుతోంది. 99 శాతం మంది సబ్స్క్రైబర్లు అసలు ఆ ఆటల జోలికే వెళ్లట్లేదని లేటెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్‌లో మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య 221 మిలియన్లు కాగా అందులో
Central Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపర్చే వార్త వెలువడింది. వాళ్ల వేతనాల సవరణకు సంబంధించి 8వ వేతన సంఘాన్ని ఏర్పాటుచేసే ప్రతిపాదనేదీ తమవద్ద లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. 7వ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరిలో ఏర్పాటుచేయగా
TikTok: 2020లో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో కనుమరుగైన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ మళ్లీ ఇండియాలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్‌డ్యాన్స్‌తో ముంబైకి చెందిన Sky esports కంపెనీ చర్చలు జరిపింది. టిక్‌టాక్ త్వరలోనే ఇండియాకు వస్తుందని ఆ కంపెనీ సీఈవో శివనంది నిర్ధారించారు. అలాగే BGMI గేమ్ కూడా 100 శాతం తిరిగి ప్రారంభమవుతుందని శివనంది తెలిపారు. కాగా గత నెలలో Hirandandani కంపెనీతోనూ బైట్‌డ్యాన్స్ చర్చలు జరిపింది. Read…