Hero Ramcharan for Hero Company: హీరో మోటోకార్ప్ సంస్థ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ నటుడు రాంచరణ్‌తేజ్‌ని నియమించుకుంది. గ్లామర్ ఎక్స్‌టెక్ అనే మోడల్‌కి ఆయన ప్రచారం చేస్తారు. బైక్ స్టైల్, సేఫ్టీ మరియు పెర్ఫార్మెన్స్‌కి హీరో రాంచరణ్ సింబాలిక్‌గా నిలుస్తారని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఇదిలాఉండగా.. హీరో కంపెనీతో కలిసి పనిచేయనుండటం, గ్లామర్ ఎక్స్‌టెక్ గురించి తన ద్వారా మరింత మందికి తెలియనుండటం పట్ల రాంచరణ్‌తేజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన అభిమానులకు కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
రిక్రూట్మెంట్ వేగం పెంచండి
ప్రభుత్వ రంగ బ్యాంకులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసి గడువులోగా పూర్తిచేయాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించినట్లు తెలిసింది. PSBల్లోని ఉద్యోగ ఖాళీలపై ఈ నెల ప్రారంభంలో సమీక్ష నిర్వహించి చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారని సమాచారం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా నిర్వహించిన సమావేశంలో కూడా ఎస్సీ బ్యాక్‌లాగ్ వేకెన్సీల నియామకాన్ని త్వరగా పూర్తిచేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
read also: Poonam Kaur: అబార్షన్ తీర్పుపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు..
‘స్టేడియా’కి గూగుల్ ఎండ్ కార్డ్
తమ గేమ్ స్ట్రీమింగ్ సర్వీస్ ‘స్టేడియా’కి ఎండ్ కార్డ్ వేస్తున్నట్లు అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. వచ్చే జనవరి 18వ తేదీతో ఇది పూర్తిగా మూతపడుతుందని స్పష్టం చేసింది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కొనుగోళ్లు చేసినవారికి డబ్బులను తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపింది. స్టేడియా కంట్రోలర్‌తోపాటు గేమ్స్ మరియు యాడ్-ఆన్ కంటెంట్ కొన్న ప్రతిఒక్కరికీ రిఫండ్ చేస్తామని పేర్కొంది. ఈ చెల్లింపులు జనవరి రెండో వారం నాటికి పూర్తికావొచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
ఇవాళ స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు గంట వ్యవధి లోపే లాభాల్లోకి వచ్చాయి. 242 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 56652 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 9 పాయింట్లు లాభపడి 16827 పైన కొనసాగుతోంది. 10 గ్రాముల బంగారం 50145 వద్ద, కిలో వెండి 56373 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. హీరో మోటో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, జైడస్ లైఫ్, వీఐ స్టాక్స్ ఆశాజనకంగా ఉన్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.68 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.