Jammu Kashmir: జమ్మూలోని అర్నియా సెక్టార్‌లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) పోస్ట్‌పై గురువారం రాత్రి పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపింది.
Honey Trap: భారతదేశ రహస్యాలను తెలుసుకోవడానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హనీట్రాప్ ని ఉపయోగిస్తున్నాయి. ఇప్పటికే డీఆర్డీఓలో పనిచేస్తున్న ఓ సైంటిస్టు సున్నితమైన భారత మిస్సైల్ రహస్యాలను ఓ పాకిస్తాన్ మహిళా ఏజెంట్ లో పంచుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో హనీట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది.
Drones: ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఉగ్రచర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలొస్తున్నాయ్. కారణం నిత్యం దేశ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా పాక్ డ్రోన్లు దేశంలోకి ప్రవేశిస్తుండడం కలవర పెడుతోంది. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్ల కలకలం రేగింది.
భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా.. వారిని బీఎస్ఎఫ్ దళం అడ్డుకుంది. వారిపై కాల్పులు జరపగా.. ఇద్దరు తప్పించుకున్నారు. ఈ క్రమంలో వారు జారివిడిచిన కూజా లాంటి బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 13 కోట్ల విలువైన పాము విషాన్ని బలుఘాట్ అటవీ శాఖకు అప్పగించినట్లు రేంజర్ సుకాంత్ ఓజాన్ వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో బంగ్లాదేశ్ నుంచి 27 బంగారు కడ్డీలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) గురువారం అరెస్టు చేసింది.
Smuggling: గుజరాత్ తీరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇరాన్ నుంచి అక్రమంగా వచ్చిన ఓ బోటులో డగ్స్ కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు. మొత్తం రూ. 425 కోట్ల విలువైన 61 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్ట్ చేశారు. గుజరాత్ ఏటీఎస్ ఇచ్చిన సమాచారం మేరకు ఇరాన్ పడవను కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు.
Drugs Seized : సరిహద్దు భద్రతా దళం (BSF) గుజరాత్‌లోని భుజ్ సెక్టార్‌లో 22 మంది పాకిస్తానీ మత్స్యకారులను పట్టుకుంది. మొత్తం 79 ఫిషింగ్ బోట్‌లను స్వాధీనం చేసుకుంది.
మేఘాలయలోని స్నైఫర్ డాగ్‌లలో ఒకటి మూడు కుక్కపిల్లలకు జన్మనిచ్చిన తర్వాత సరిహద్దు భద్రతా దళం కోర్టు విచారణకు ఆదేశించింది. డిప్యూటీ కమాండెంట్ ర్యాంక్ అధికారి ఈ విషయంపై నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
World Record: సాధారణంగా బైక్‌పై కూర్చుని ఏకధాటిగా 50 కిలోమీటర్లు నడపటం కష్టతరంగా ఉంటుంది. కానీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)కు చెందిన ఓ స్టంట్ బైకర్ సోమవారం నాడు ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో భాగంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ బైక్‌పై ఫ్యూయల్ ట్యాంకర్‌పై నిలబడి 59.1 కిలోమీటర్ల పాటు ప్రయాణించాడు. అతడు 59.1 కి.మీ. దూరాన్ని ఒక గంట 40 నిమిషాల 60 సెకన్‌లలో చేరుకుని రికార్డు…
Indian Soldier Accidentally Crosses Border, Captured By Pakistan: అనుకోకుండా సరిహద్దు దాటిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( బీఎస్ఎఫ్) జవాన్ ని నిర్భంధించింది పాకిస్తాన్. సరిహద్దు దాటడంతో పాక్ రేంజర్లు అన్ని పట్టుకున్నారని అధికారులు వెల్లడించారు. పంజాబ్ సెక్టార్ లో బుధవారం ఈ ఘటన జరిగింది. అతన్ని భారత్ కు అప్పగించడం కోసం వేచి చూస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇలా అనుకోకుండా బోర్డర్ క్రాస్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గత వారం డిసెంబర్…