Drugs Seized : సరిహద్దు భద్రతా దళం (BSF) గుజరాత్‌లోని భుజ్ సెక్టార్‌లో 22 మంది పాకిస్తానీ మత్స్యకారులను పట్టుకుంది. మొత్తం 79 ఫిషింగ్ బోట్‌లను స్వాధీనం చేసుకుంది. 2022లో బీఎస్ఎఫ్ సాధించిన విజయాలపై ఒక ప్రకటన విడుదల చేసింది. సరిహద్దుల్లో శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేయడం ద్వారా బీఎస్ఎఫ్ తన పట్టు మరింత బలోపేతం చేస్తోంది. 7,419 కి.మీ భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో కాపలాగా ఉన్న బీఎస్ఎఫ్ 2022లో రూ.250 కోట్ల విలువైన 50 హెరాయిన్ ప్యాకెట్లు, రూ. 2.49 కోట్ల విలువైన 61 చరస్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంది.
Read Also: Elon Musk: మస్త్ సమస్యల్లో మస్క్.. ఆఫీసు అద్దె చెల్లించలేదని కేసు
రాజస్థాన్‌లోని బార్మర్ నుంచి రాణా ఆఫ్ కచ్ – క్రీక్ ప్రాంతం వరకు 826 కి.మీ. పొడవైన భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దును బీఎస్ఎఫ్ కాపలా కాస్తుంది. గతేడాది ఇల్లీగల్ ట్రాన్స్ బార్డర్ యాక్టివిటీస్ కు పాల్పడినందుకు 22 మంది భారతీయులు, నలుగురు పాకిస్థానీలు, ఇద్దరు బంగ్లాదేశీయులు, ఇద్దరు కెనడియన్లు, ఒక రోహింగ్యాలను అరెస్టు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Bomb At CM House: సీఎం ఇంటి దగ్గర బాంబు స్వాధీనం.. ఊపిరి పీల్చుకున్న అధికారులు
గుజరాత్ ప్రభుత్వ మద్దతుతో అక్టోబర్ 31, 2022న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా కెవాడియాలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ పరేడ్‌ని విజయవంతంగా నిర్వహించామని బీఎస్ఎఫ్ తెలిపింది. సరిహద్దు జనాభా ప్రయోజనాల కోసం ఉచిత వైద్య శిబిరాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని పేర్కొంది. శిక్షణ, క్రీడా కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు.. బీఎస్ఎఫ్ కు 11 సరిహద్దులలో వరుసగా మూడుసార్లు 2021-22లో అశ్విని ట్రోఫి లభించిందని ప్రకటనలో బీఎస్ఎఫ్ పేర్కొంది.