తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ కార్యకర్తలతో సమావేశమయ్యారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ తో పాటు సమావేశంలో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ తయారు చేసిన క్యాడర్ ఇక్కడికి వచ్చింది.. మాగంటి గోపినాథ్ మూడు సార్లు మీ ఆశిస్సులతో గెలిచాడు.. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రజలు కాంగ్రెస్ నాయకులను ఒక్కరిని నమ్మలేదు.. ఒక్కరిని కూడా బిఆర్ఎస్ మినహా ఎవరిని అసెంబ్లీ కి పంపలేదు..…
ఫీజు రీయంబర్స్ మెంట్ బ్రాండ్ అంబాసిడర్లం తామేనని సంకలు గుద్దుకున్న కాంగ్రెస్ నేతల నిర్వాకంవల్లే కాలేజీలు మూతపడి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీ, మిస్ వరల్డ్ పోటీల పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 15 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు కనబడటం లేదా? రాష్ట్ర బడ్జెట్ లో నుండి రూ.8…
తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అంశం ఏదైనా ఉందంటే అది యూరియా కొరత మాత్రమే. గత కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా లభించకపోవడంతో రైతన్నలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్ లో నిల్చోని అలసిపోతున్నారు. అయినప్పటికీ యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు యూరియా అందించే సమయంలో యూరియా లేకపోవడంతో దిగుబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Also Read:Boinapalli Medha School:…
కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్‌లో ఎలాంటి ప్రకంపనలు రేగుతున్నాయో... ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదంతా ప్రాజెక్ట్ నిర్మాణం చుట్టూ జరుగుతున్న రచ్చ. ఫ్రంట్ పోర్షన్లో ఆ స్థాయి రచ్చ జరుగుతుంటే... బ్యాక్‌లో కూడా ఆ స్థాయి కాకున్నా... దాదాపు అలాంటి గొడవే జరుగుతోంది. అక్కడ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ లబ్దికోసం పావులు కదుపుతూ పరస్పరం టార్గెట్ చేసుకుంటున్నాయి.
తెలంగాణ రాజకీయంలో ఎక్కువ భాగం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో బైపోల్ అనివార్యమైంది. ఇంకో రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చని భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద హాటు ఘాటు చర్చలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఇక్కడ బైపోల్ తప్పలేదు. వచ్చే రెండు మూడు నెలల్లో ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అందుకోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. సిట్టింగ్ సీటుగా బీఆర్ఎస్కు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌కు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది.
గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పుతో లోకల్ కేడర్‌లో గందరగోళం పెరిగింది. దాంతో నడిగడ్డ కారుకు గట్టి రిపేర్లు చేసి గాడిన పెట్టేందుకు తీవ్ర కసరత్తు చేస్తోందట గులాబీ అధిష్టానం. నెలల తరబడి స్తబ్దుగా ఉన్న గద్వాల్ కేడర్‌లో ఊపు తెచ్చే ప్రయత్నం మొదలైనట్టు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్....
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, కానీ తమకు అండగా నిలిచిన మాగంటి కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసు 'లొట్టపీసు కేసు' అని, ఇందులో ఎలాంటి స్కాం జరగలేదని ఆయన అన్నారు.