Kavitha : ఇప్పుడు నాకు ఎలాంటి బంధనాలు లేవు.. నేను ఫ్రీ బర్డ్‌ని
- కరీంనగర్‌లో జాగృతి జనం బాట పాదయాత్రకు ప్రజల విశేష స్పందన
- రైతులు, విద్య, వైద్యం, మైనారిటీల సమస్యలపై ప్రభుత్వాన్ని ఆక్షేపించిన కవిత
- పర్యావరణ పరిరక్షణ, సామాజిక తెలంగాణ కోసం జాగృతి కట్టుబడి ఉందని హామీ
- ఇప్పుడు నాకు ఎలాంటి బంధనాలు లేవు, నేను ఫ్రీ బర్డ్‌ని : కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha : కరీంనగర్ జిల్లా పరిధిలో జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జాగృతి జనం బాట పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని పేర్కొన్నారు. “సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం అన్ని వర్గాల వారినీ కలుపుకొని ముందుకు సాగుతున్నాం. విద్య, వైద్యం వంటి కీలక అంశాలు ఇంకా జనాల మధ్య లోతుగా చేరాల్సి ఉంది,” అని కవిత తెలిపారు.
సింగరేణి సంస్థను కాపాడడంలో మాజీ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేసిన ఆమె, ఆర్టీసీ విభాగంలో ఉన్న సమస్యలపై విప్లవాత్మక ఆలోచన అవసరమని సూచించారు. “సామాజిక తెలంగాణను సాకారం చేయడం మనందరి బాధ్యత,” అని అన్నారు. “తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి మనం అందరం కృషి చేశాం. కానీ కరీంనగర్ జిల్లాలో రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈ సమస్యలపై దృష్టి పెట్టాలి,” అని వ్యాఖ్యానించారు. పంటనష్టంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలు చనిపోతే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గురుకుల పాఠశాలల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. “రాష్ట్రంలో మైనారిటీ సమస్యలను పట్టించుకోవాలి. మైనారిటీ అభివృద్ధికి కనీసం రూ.2,000 కోట్లు కేటాయించాలి. ఎన్నికలు సమీపించాకే మైనారిటీల గుర్తొచ్చాయా?” అని ప్రశ్నించారు. తన రాజకీయ పరిస్థితిపై స్పందిస్తూ కవిత, “ఇప్పుడు నాకు ఎలాంటి బంధనాలు లేవు.. నేను ఫ్రీ బర్డ్‌ని. పర్యావరణ పరిరక్షణను మా జాగృతి ప్రాధాన్యంగా తీసుకుంటుంది. తెలంగాణలో రాజకీయ శూన్యత నెలకొంది, ప్రజల గొంతుకగా మారబోతున్నాం,” అని తెలిపారు.
మానకొండూర్ నియోజకవర్గంలో పంటనష్టం జరిగినా, అక్కడి ఎమ్మెల్యేలు స్పందించలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇప్పటివరకు కార్మిక చట్టాలపై స్పందించలేదని వ్యాఖ్యానించారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై ప్రభుత్వం నిశ్శబ్దంగా వ్యవహరిస్తోందని కవిత పేర్కొన్నారు. తన ఎమ్మెల్సీ పదవీ రాజీనామా అంశంపై మళ్లీ చైర్మన్, స్పీకర్‌లను కలుస్తానని తెలిపారు. “నేను తెలంగాణ ప్రజల బాణాన్ని. ప్రజల కోసం, సమాజం కోసం నా గొంతు వినిపిస్తూనే ఉంటాను,” అని కవిత స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
-
పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
-
Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!