CM Revanth Reddy : కేసీఆర్ వక్రబుద్ధితో SLBCని పడుకోబెట్టారు
- SLBCని గత ప్రభుత్వం గాలికి వదిలేసింది
- పదేళ్లు.. పది కిలో మీటర్ల టన్నెల్ కూడా పూర్తి చేయలేదు
- కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో టన్నెల్ పూర్తియ్యేది
- SLBC పూర్తి ఐతే కాంగ్రెస్ కి పేరు వస్తుంది అని పక్కన పెట్టారు: సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : నాగర్‌కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. SLBCని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. పదేళ్లు.. పది కిలో మీటర్ల టన్నెల్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో టన్నెల్ పూర్తియ్యేదని, SLBC పూర్తి ఐతే కాంగ్రెస్ కి పేరు వస్తుంది అని పక్కన పెట్టారని ఆయన మండిపడ్డారు. పేరే కాదు.. కమిషన్ కూడా రాదని కేసీఆర్.. హరీష్ పక్కన పెట్టారన్నారు. కేసీఆర్ వక్రబుద్ధితో SLBCని పడుకోబెట్టారని ఆయన ధ్వజమెత్తారు.
Tollywood : డిసెంబర్ టార్గెట్ గా దూసుకొస్తున్న సినిమాల లిస్ట్ ఇదే
Also Read
అంతేకాకుండా..’ 42km టన్నెల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. దీన్ని పూర్తి చేస్తే.. ఆ కీర్తి కూడా తెలంగాణ కి దక్కుతుంది. పదేళ్లలో 5 వేల కోట్లు లిఫ్ట్ ల విద్యుత్ కి ఖర్చు చేశారు. కానీ రెండు వేల కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది. ఇప్పుడు 4600 కోట్లతో ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి అవుతుంది. గ్రావిటీతో నీళ్ళు ఇవ్వచ్చు. నల్గొండ.. మహబూబ్ నగర్ కి తీవ్ర నష్టం చేశారు కేసీఆర్. కృష్ణ నది మీద కేసీఆర్ కూడా తెలంగాణ కి నష్టం చేశారు. ప్రాజెక్టులకి 1.86 వేల కోట్లు ఖర్చు చేశారు కేసీఆర్. కాళేశ్వరంకే లక్ష 20 వేల కోట్లు ఖర్చు చేశారు. పదేళ్లలో ప్రాజెక్టు లు పూర్తి చేయలేదు. ఇప్పుడు వాటి మీద ఆంధ్రా అభ్యంతరం చెప్తుంది. ఏపీకి అలూసు ఐపోయింది. కార్మికులు చనిపోవడం బాధకరమైన అంశమే. మాక్కూడా ప్రాణం విలువ తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడే ఉండి.. ఆర్మీ సపోర్ట్ తీసుకున్నారు. నిపుణులైన ఆర్మీ అధికారులను డిప్యూటేషన్ మీద తెచ్చుకున్నాం. బ్యాలెన్స్ టన్నెల్ 9.8 km ఉంది.
హరీష్ రావు.. చిల్లర మాటలు మానేయండి. SLBC మేము పూర్తి చేయకపోతే ప్రజలు మమల్ని క్షమిస్తారా..? SLBC పూర్తి చేయకపోతే.. మేము అధికారంలో ఉండి ఏం లాభం. పాలమూరు.. నల్గొండ ప్రజలు ఐక్యంగా ఉండండి. ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఎదురుకోండి. టన్నెల్ బోర్ మిషన్ తీసేస్తున్నాం. ఏరియల్ సర్వే చేస్తే.. భూమిలో ఏముంది అనే డేటా వస్తుంది. అందుకు అనుగుణంగా పనులు.. అందుకే సర్వే.. కేసీఆర్ నీళ్లకు నడక నేర్పిన అంటున్నాడు కదా.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులే చేశాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసిండో.. కేసీఆర్ అదే చేశాడు. అంత దానికి కేసీఆర్ అవసరమా..? జరిగిన తప్పులు సరిదిద్దుతు ముందుకు వెళ్ళాలి. బీఆర్‌ఎస్‌నీ బొంద పెట్టినా బుద్ధి రాలేదు.’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Jaipur Accident: జైపూర్‌లో మృత్యు ఘోష.. 10 మంది మృతి.. 40 మందికి తీవ్ర గాయాలు
- Tags
- BRS
- congress
- kcr
- revanth reddy
- SLBC
తాజావార్తలు
-
OTR: దసరాలోపు పదవుల భర్తీ పూర్తి చేసే ఆలోచన?
-
Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..
-
Election Commission: విభేదాలకు కారణమైన ఫారం 6పై ఈసీఐ ఫుల్ క్లారిటీ..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్’ పురస్కారం
-
Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!