KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆత్మగౌరవ పోరాటంగా తీసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. జూబ్లీహిల్స్‌లో ప్రచార సభలో మాట్లాడుతూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “పచ్చి జూటా మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు హైడ్రా పేరుతో బుల్డోజర్లతో పాలన చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకోవాలి — కార్ కావాలా? లేక…
రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకానుంది. ఎన్నికల సంఘం రేపు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. రేపటి నుంచి మొదలు 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. 22 న నామినేషన్లు పరిశీలన కాగా.. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసిన జిల్లా ఎన్నికల సంఘం. షేక్ పేట్ తహసిల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. Also Read:…
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు.
Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజకీయం మొదలైంది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం, కేంద్రంపై విరుచుకుపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ.. “ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా, తిరిగి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజలు మళ్లీ కేటీఆర్, కేఎస్ఆర్ నేతృత్వంలోనే తెలంగాణను ముందుకు నడిపిస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు. “బీజేపీ దేశం కోసం కాదు, కేవలం నార్త్ ఇండియన్ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోంది. తెలంగాణ కూడా భారతదేశంలో భాగమే కదా?…
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు ఆయన గారు. కానీ... కారులో పవర్ పోయాక ఏసీ ఆగిపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యారో ఏమోగానీ... ఠక్కున డోర్ తన్నుకుంటూ బయటపడ్డారు. తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా...జై తెలంగాణ నుంచి జై కాంగ్రెస్ అంటూ గోడ దూకేశారు దానం నాగేందర్.
Bhatti Vikramarka: బీఆర్ఎస్ పార్టీ తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని, కానీ రానున్న స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాలకు తెలుసునని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పెద్దలు 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆర్థిక, పాలన వ్యవస్థలను విధ్వంసం చేస్తే ప్రణాళికా ప్రకారం వాటిని సరి చేసుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని…
జూబ్లీహిల్స్‌లో గులాబీ ముళ్ళు గట్టిగానే గుచ్చుకుంటున్నాయా? అభ్యర్థి ప్రకటన తర్వాత అలకలు పెరిగిపోయాయా? వాటివల్ల విజయావకాశాలు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందా? అందుకు అధిష్టానం దగ్గర విరుగుడు ఉందా? లేక వాళ్ళవల్ల ఏమవుతుందని లైట్ తీసుకుంటారా? అలిగిన నేతలు ఎవరు? పార్టీ బై పోల్ వ్యూహం ఏంటి? ఉప ఎన్నిక… జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్లో అసంతృప్తులకు ఆజ్యం పోస్తోందట. సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకోవాలన్న టార్గెట్‌తో.. ఇప్పటికే డివిజన్ల వారీగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఇన్‌చార్జ్‌లుగా పెట్టింది పార్టీ.…
లగ్జరీ కార్ల వెనకున్న బసరత్ ఖాన్ రహస్యాలు..? హైదరాబాద్‌లోని లగ్జరీ కార్ల డీలర్ బసరత్ అహ్మద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాలపై శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్‌లోని ఖాన్ నివాసం, గచ్చిబౌలిలోని SK కార్ లౌంజ్తో పాటు ఆయన స్నేహితుల ఇళ్లలోనూ ఈ దాడులు జరిగాయి. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనల కేసులో భాగంగా, స్మగ్లింగ్ ద్వారా దిగుమతి చేసిన హైఎండ్ కార్ల వ్యవహారాలపై అధికారులు ఈ సోదాలు చేపట్టారు. బసరత్ ఖాన్ ఇప్పటికే…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత పేరు ఖరారైంది. మాగంటి సునీత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. జూబ్లీహిల్స్ నియిజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకే సునీతకు అవకాశం ఇస్తున్నట్లు గులాబీ బాస్ తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌లో బైఎలక్షన్‌జరుగుతున్న విషయం తెలిసిందే. గత జూన్ 8న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గుండెపోటుతో…