Vice Presidential Election: దేశంలోని 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ హౌస్‌లో జరిగింది. మొత్తం 768 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభతో సహా మొత్తం 788 మంది ఎంపీలు ఉన్నారు. ప్రస్తుతం రెండు సభలలో 7 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే.. మొత్తం 781 మంది ఎంపీలు ఓటు వేయాల్సి ఉంటుంది. వారిలో…
తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణించిన ఆయన, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో తప్పులు జరిగాయని కోర్టు నమ్మినట్లు తెలిపారు.
ప్రతిపక్షంలోకి వచ్చాక బీఆర్ఎస్కు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. పదేళ్ళపాటు తిరుగులేని అధికారాన్ని చెలాయించిన పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోల్పోవడం ఒక ఎత్తయితే....ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం మరింత కుంగదీసింది. ఇక పార్టీని రీ ఛార్జ్ చేయాలి, గ్రామస్థాయి నుంచి మళ్ళీ పటిష్టం చేయడం కోసం జనంలోకి దూకుడుగా వెళ్ళాలనుకుంటున్న టైంలో... కవిత రూపంలో ఊహించని మాస్టర్ స్ట్రోక్ తగిలింది. మూడు నెలల క్రితమే తేడా వచ్చినా...…
తెలంగాణలో పార్టీ మారి... మెడమీద అనర్హత కత్తి వేలాడుతున్న ఎమ్మెల్యేల్లో చాలామంది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టెక్నికల్ మాట్లాడుతున్నారు. పార్టీ మారలేదని కొందరు, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని మరికొందరు చెప్పుకుంటున్నారు. మరోవైపు అనర్హత పిటిషన్ విషయంలో... చర్చ సీరియస్‌గానే నడుస్తోంది. స్పీకర్‌కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతుండటంతో... ఇక నాన్చకుండా... ఏదో ఒక చర్య తీసుకునే అవకాశం ఉందనే టాక్ గట్టిగానే ఉంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నదిని తప్పకుండా ప్రక్షాళన చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ఏడాదే గోదావరి ఫేజ్ 2, 3 పనులు ప్రారంభిద్దాం అనుకున్నా కొందరు అడ్డుకున్నారని.. గోదావరి ఫేజ్ 2, 3 ద్వారా 20 టీఎంసీల నీటిని తీసుకువస్తాం అని చెప్పారు. 2014 నుంచి బీఆర్ఎస్ ఒక్క చుక్క నగరానికి తీసుకురావాలనే ఆలోచన చేయలేదని, తాము మరలా అధికారంలోకి వచ్చాక గోదావరి నీటిని తీసుకురావడానికి ప్రణాళికలు చేసి ముందుకెళ్తున్నామన్నారు. ప్రాణహిత…
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓటింగ్‌లో పాల్గొనదు అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ న్యాయ కోవిధుడు అని, ఆయనకు మద్దతు ఇవ్వకపోవడానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయలేమని బీఆర్ఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయాలకు కనెక్షన్ లేకుండా బీఆర్ఎస్ మారిందని, ఇంటి లొల్లిలకే పార్టీ పెద్దలకు సరిపోతోందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందని ఎంపీ చామల…
ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్ ఎంపీలు.. తెలుగు వ్యక్తి, యూపీఏ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి కే.కవిత సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న కవితపై గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. పార్టీ లైన్ దాటడంతో.. సొంత కూతురు అని కూడా చూడకుండా కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆ మరుసటి రోజే కవిత మీడియా సమావేశం నిర్వహించి.. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కవిత సస్పెన్షన్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం పై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది.. ఎన్నికల ముందు విష ప్రచారం చేసింది.. ఎన్నికల తరువాత కూడా కాళేశ్వరం పై కక్ష కట్టింది.. కాళేశ్వరం పై కక్ష కట్టి సిబిఐ విచారణ కు ఆదేశించారు.. వారం తిరగక ముందే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తున్నాం అని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు.. తల దగ్గర…
మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల వివక్షత చూపిస్తుందన్నారు. ఎరువుల తయారీ, సరఫరా భాద్యత కేంద్రానిదే.. ఉద్దేశ పూర్వకముగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఓపెన్ చేయట్లేదు.. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా పట్టించుకోట్లేదు.. మీకు చేతనైతే కేంద్రం మెడలు వంచి ఎరువులు తెండి.. రైతులు ఉద్యమించే వరకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది.. Also Read:Horrific Incident in Visakha: విశాఖలో…