KTR : హైదరాబాద్ ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి
- గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయారు
- ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను అద్భుతంగా పోషిస్తున్నాం
- బీఆర్‌ఎస్ హయాంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం
- గ్రామీణ ప్రాంతాల్లో కంటే హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది
- విద్యావంతులు ఉన్న HYDలో ఓటింగ్ శాతం తక్కువ ఉండటం బాధాకరం
- ఓటు వేసేందుకు ముందుకు రాకుంటే.. రిగ్గింగ్ జరిగే అవకాశం ఎక్కువ. -కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వేగంగా సాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం షేక్‌పేట్‌లోని ఆదిత్య ఇంప్రెస్ గేటెడ్ కమ్యూనిటీని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి సాధించిందని చెప్పారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనేది మా ప్రియమైన నాయకుడు మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఎన్నిక. మాగంటి కుటుంబం ఈ నియోజకవర్గంలో ఎంతో సేవ చేసింది. అందుకే వారి భార్య మాగంటి సునీతమ్మకు టికెట్ ఇచ్చాం. మా పార్టీ ఎప్పుడూ తమ నాయకుల కుటుంబాలను గౌరవంగా చూసుకుంటుంది అని అన్నారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
“సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఎందుకంటే నగర ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. మా పాలనలో ఐటీ రంగం అద్భుతంగా అభివృద్ధి చెందింది, దేశ నలుమూలల నుంచి ఉద్యోగాల కోసం యువత హైదరాబాద్‌కి వస్తున్నారు. కోవిడ్ సమయంలో కూడా ఆ అవకాశాన్ని వదిలిపెట్టకుండా అనేక నిర్మాణ పనులు, ఫ్లైఓవర్లు, మెట్రో ప్రాజెక్టులు చేపట్టాం. ఇప్పటివరకు 42 ఫ్లైఓవర్లు, 70 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం పూర్తి చేశాం” అని వివరించారు.
“వ్యవసాయ రంగంలో తెలంగాణ ఇప్పుడు పంజాబ్, హర్యానాలకు సాటి అవుతోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో ఇది సాధ్యమైంది. ఒకప్పుడు నగరంలో జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు తప్పనిసరిగా కనిపించేవి, కానీ ఇప్పుడు కరెంట్ కోతలు, నీటి కొరత లేని స్థాయికి అభివృద్ధి చేసాం. హరితహారంతో రాష్ట్రాన్ని గ్రీన్ ఎకానమీగా మార్చాం” అని కేటీఆర్ తెలిపారు.
“హైదరాబాద్‌లో విద్యావంతులు ఎక్కువగా ఉన్నా, ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. ఇది బాధాకరం. మీరు ఓటు వేయడానికి రాకపోతే రిగ్గింగ్‌కి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలి,” అని కేటీఆర్ అన్నారు. “అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. సంక్షేమ పథకాలతో ప్రతి వర్గం లబ్ధి పొందింది. గంగా–జమున తహసీబ్ సంస్కృతిని కాపాడాం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రామీణ ప్రజలను మోసం చేసింది. అయినా కేవలం ఒకటిన్నర శాతం తేడాతోనే బీఆర్‌ఎస్ ఓడిపోయింది,” అని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!