Komati Reddy: రాష్ట్రంలో 30లక్షల మంది నిరుద్యోగులు రోడ్లపైన ఉన్నారు..! వారి గురించి సీఎం కేసీఆర్ మాట్లాడరా? అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం యెల్లారెడ్డిగూడెం గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు భూపాల్ పుట్టిన వేడుకల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
Harish Rao: ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న అన్నట్టు ప్రతిపక్షాలు చేస్తాయని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, భూమిపూజ చేశారు.
KCR Medak Tour: మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19న మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది. అయితే ఆ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈ నెల 23కు వాయిదా పడిందని బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించారు.
CM KCR: సమైక్య పాలనలో తెలంగాణలోని అన్నిరంగాలు విధ్వంసమైపోయాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను. గత ఏడాది భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడు వజ్రోత్సవాల సమాపన ఘట్టాన్ని కూడా అంతే ఘనంగా నిర్వహించు కుంటున్నాం. ఈ సందర్భంగా…
Kishan Reddy: కాంగ్రెస్ కు ఓటు వేసిన BRS కి వేసినట్టే అని, ఈ రెండు పార్టీ లకి ఓటు వేస్తే మజ్లిస్ కు వేసినట్టేనని.. స్టీరింగ్ మజ్లిస్ పార్టీ చేతిలోనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఫతేనగర్ లోని నిరుపేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాలైన దీన్ దయాల్ నగర్.. అమృత నగర్ తండా, కార్మిక నగర్ మొదలగు ప్రాంతాల్లో ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు అప్లై చేసుకున్నారని.. అయితే అతి త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందించే బాధ్యత నాదని వారికి హామీ ఇచ్చారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల టైంలో మర్రి జనార్దన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపిస్తూ.. దాఖలు చేసిన పిటిషన్ను ఇవాళ ( సోమవారం ) హైకోర్టు కొట్టి వేసింది
కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొని.. షబ్బీర్ అలీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లుగా అధికార బీఆర్ఎస్.. ప్రజా సమస్యలను విస్మరించిందని ఆరోపించారు.